Animals: 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే జంతువులు ఏవంటే..!
ABN, Publish Date - Mar 09 , 2024 | 05:06 PM
ఎక్కువ కాలం జీవించే జంతువుల గురించి తెలుసుకోవడం ఆసక్తిగానే ఉంటుంది. మనుషుల కాల పరిమితి తరిగినా జంతువులు మాత్రం వందేళ్ళు దాటి జీవిస్తున్నాయి. వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని జాతులకు చెందిన జీవుల పుట్టుక, మరణాన్ని రికార్డ్ చేయలేరు,
ఎక్కువ కాలం జీవించే జంతువుల గురించి తెలుసుకోవడం ఆసక్తిగానే ఉంటుంది. మనుషుల కాల పరిమితి తరిగినా జంతువులు మాత్రం వందేళ్ళు దాటి జీవిస్తున్నాయి. వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని జాతులకు చెందిన జీవుల పుట్టుక, మరణాన్ని రికార్డ్ చేయలేరు, సాధారణంగా జాతి జీవశాస్త్రం గురించి తెలిసిన దాని ఆధారంగా ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించే జంతువులు ఇవే.. చాలా కాలం జీవించే జీవుల్లో మనుషులు అప్పుడప్పుడూ 100 సంఖ్యను దాటి జీవించేవారు. అయితే కొన్ని జంతువులు కూడా 100 సంవత్సరాల కాలం జీవిస్తాయట. వాటిలో..
గాలాపాగోస్ పెద్ద తాబేలు దాదాపు 100 సంవత్సరాలు పైగా జీవించింది. ఇందులో నమోదు చేయబడిన పురాతన తాబేలు సుమారు 152 సంవత్సరాలు జీవించిందని అంచనా..
సముద్ర జంతువులలో అనేక రకాలు కూడా 100 సంవత్సరాలకంటే ఎక్కువ జీవిస్తాయి. వాటిలో బౌహెడ్ తిమింగలాలు. ఇవి భూమిపై ఎక్కువ కాలం జీవించే క్షీరదాలలో ఒకటి, ఇందులో కొన్ని 200 సంవత్సరాలు బ్రతికినట్టు అంచనా.
ఇది కూడా చదవండి : ఈ పిట్టకోసిస్ వ్యాధికి చిలకలే కారణమా..? దీని లక్షణాలు ఏమిటంటే..!
కోయి చేపలు జపనీస్ చేపలు వాటి అందమైన తెలుపు నారింజ రంగులలో ఉండి ఒక శతాబ్దానికి పైగా జీవించగలవు. రికార్డుల ప్రకారం, 226 సంవత్సరాలు జీవించాయట. జపనీస్ కోయి సగటు ఆయుర్దాయం దాదాపు 40 సంవత్సరాలు అయినప్పటికీ సరైన పరిస్థితుల్లో జీవిస్తే చాలా ఎక్కువ కాలం జీవించగలవు. "హనాకో" అని పేరు పెట్టిన ఒక నిర్దిష్ట కోయి 1977లో మరణించినప్పుడు దాని వయస్సు 226. శాస్త్రవేత్తలు వీటి వలయాలను లెక్కించడం ద్వారా వాటి వయస్సును నిర్థారించారు.
ఓషన్ క్యాహాగ్ అట్లాండిక్ మహాసముద్రంలో కనిపించే ఈ పెద్ద క్లామ్స్, ఇది ఎక్కువ కాలం జీవించిన జంతువులలో ఒకటి. వీటి రికార్డ్‌ని బట్టి 170 ఏళ్ళు పైనే బతికినట్టుగా ఉంది. ఓషన్ క్వాహాగ్స్ 2006లో ఐస్‌లాండ్ తీరంలో పట్టుకున్నప్పుడు రికార్డులో ఉన్న అతి పురాతనమైనది 507 ఏళ్ల వయస్సు. శాస్త్రవేత్తలు షెల్‌పై పెరుగుదల వలయాలను లెక్కించడం ద్వారా వయస్సును నిర్ణయించగలిగారు.
గ్రీన్లాండ్ షార్క్ ఉత్తర అట్లాంటిక్ చల్లని నీటిలో నివసింంచే గ్రీన్లాండ్ సొరచేపలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇవి రికార్డుల ప్రకారం 400 ఏళ్ళు జీవించగలవని అంచనా వేయబడింది. గ్రీన్‌ల్యాండ్ సొరచేపలు 300, 500 సంవత్సరాల మధ్య జీవిస్తాయి. ఎక్కువ కాలం జీవించే సకశేరుకాలు. అవి చాలా నెమ్మదిగా జీవితాన్ని తీసుకుంటాయి. సగటున 0.76 mph వేగంతో కదులుతాయి. ఇవి ప్రతి సంవత్సరం ఒక సెం.మీ పెరుగుతాయి., ఆడవి 100 నుండి 150 సంవత్సరాల వయస్సు వరకు లైంగిక పరిపక్వతకు చేరుకోలేవు.
అల్డబ్రా జెయింట్ తాబేలు నెమ్మది నడకతో నిదానమైన జీవితంతో శతాబ్దానికి పైగా జీవించగలవు. వీటి రికార్డ్ దాదాపు 255 సంవత్సరాలు జీవించినట్టుగా ఉంది. ఈ రికార్డ్ వివరాలు కలకత్తా జంతు ప్రదర్శన శాలలో భాగంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!
జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
శివరాత్రి రోజున శివుడ్ని ఎలా అభిషేకించి తరించాలి.. !
ఎర్ర సముద్రపు అర్చిన్ పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే ఈ స్పైనీ జీవులు 200 సంవత్సరాలకు పైగా జీవించగలవు. ఇవి తరచుగా రాతి తీర ప్రాంతాలలో కనిపిస్తాయి.
రఫ్ ఐ రాక్ ఫిష్ ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో కనిపంచే ఈ లోతైన సముద్రపు చేప నెమ్మదిగా పెరుగుతుంది. దీర్ఘాయువు కలిగి ఉండే ఈ చేపలు దాదాపు 200 ఏళ్ళు బ్రతుకుతాయి.
ఎండ్రకాయలు ఇవి అమెరికన్ ఎండ్రకాయ అనేక రకాల ఎక్కువ 100సంవత్సరాలు పైగా జీవించగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
మకావ్ చిలుకలు చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. అలాగే ఇందులో కొన్ని జాతుల మకావ్ లు సరైన సంరక్షణ ఇస్తే సహజ అవాసాలలో ఉంటే 100 ఏళ్ళుపైగా జీవిస్తుంది. సరైన వాతావరణంలో, 60 నుండి 80 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వర్షారణ్యాలలో ఇంట్లో కాయలు, విత్తనాల మిశ్రమాన్ని తింటాయి. అయితే, ఈ అందమైన పక్షులలో ఎక్కువ భాగం అడవిలో అంతరించిపోతున్నాయి. కొన్ని ఆవాసాల క్షీణత, అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారం కారణంగా ఇప్పటికే అంతరించిపోయాయి.
Updated Date - Mar 09 , 2024 | 05:06 PM