ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: సింహాలు గుంపులుగా వచ్చాయి.. గేదె సింగిల్‌గా ఉంది.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Mar 12 , 2024 | 08:06 PM

మూడు సింహాలు కలిసి ఓ గేదెపై దాడికి దిగితే.. ఇక ఆ గేదె ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

సింహం (Lion), గేదె (Buffalo) మధ్య జరిగే పోరు జరిగినపుడు ఎవరు గెలుస్తారని అడిగితే కచ్చితంగా అందరూ సింహం పేరే చెబుతారు. మూడు సింహాలు కలిసి ఓ గేదెపై దాడికి దిగితే.. ఇక ఆ గేదె ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మూడు సింహాలు కలిసినా ఓ అడవి గేదె (Wild Buffalo) బలం ముందు చాల లేకపోయాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒంటరిగా ఉన్న అడవి గేదెపై మూడు సింహాలు దాడికి దిగాయి. ఒక సింహం వెనుక నుంచి ఆ గేదె పైకి ఎక్కింది. మరో రెండు ముందు నుంచి దాడికి దిగాయి. అయినా ఆ గేదె భయపడలేదు. ధైర్యంగా పోరాడింది. ఒక సింహాన్ని తన కొమ్ములతో పైకి ఎత్తి గాల్లోకి విసిరేసింది. ఆ సమయంలో మరో గేదె కూడా అక్కడికి వచ్చింది. రెండూ కలిసి సింహాలను ఎదురించాయి. జంగిల్ సఫారీ టూరిస్ట్‌లు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఆ గేదె ఓ జీవిత పాఠం నేర్పింది``, ``మనం ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా పోరాటం ఆపకూడదు``, ``ధైర్యంగా పోరాడితే విజయం మనదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 08:06 PM

Advertising
Advertising