ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దునియా దేఖో...

ABN, Publish Date - Aug 25 , 2024 | 08:31 AM

తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి చార్లీ దూసుకుపోతున్నాడు. కాలిఫోర్నియాలోని పసిఫికాలో ఏటా వరల్డ్‌ డాగ్‌ సర్ఫింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతాయి. అలలపై సర్ఫింగ్‌ చేస్తున్న శునకరాజులు ఓ అద్భుతమే.

నెంబర్‌ వన్‌

తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి చార్లీ దూసుకుపోతున్నాడు. కాలిఫోర్నియాలోని పసిఫికాలో ఏటా వరల్డ్‌ డాగ్‌ సర్ఫింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతాయి. అలలపై సర్ఫింగ్‌ చేస్తున్న శునకరాజులు ఓ అద్భుతమే.

కొత్తకాంతులు

మిలియన్‌ ఏళ్ల క్రితం జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడ్డ భౌగోళిక వింతలు ఈ ఫెయిరీ చిమ్నీలు. టర్కీలోని కప్పడోసియాలో ఉన్న చిమ్నీలు రాత్రి వేళల్లో కూడా మిరిమిట్లు గొలిపేలా కొత్త విద్యుత్‌కాంతులను అమర్చారు. ఇకపై చిమ్నీల చుట్టూ వెన్నెల కాంతులే.


లాంగ్‌ టేబుల్‌

పండగలూ పబ్బాలప్పుడు అందరూ కలిసి భోంచేస్తే ఆ సంబరమే వేరు. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని వుడ్స్‌లో వైల్డర్‌నెస్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత చెఫ్‌ బెన్‌ క్విన్‌ లాంగ్‌ టేబుల్‌ బ్యాంక్వెట్‌ను ఏర్పాటుచేశారు. ఈ భోజనాలను అందరూ ఇష్టపడ్డారు.

జలకాలాట

జపాన్‌లో ఎండలు మండిపోతున్నాయి. అందుకే ఈ ఏనుగు ఈతకొడుతూ కాస్త సేదతీరుతోంది. సుసోనో నగరంలోని ఫ్యుజి సఫారీ పార్క్‌లో తొమ్మిదేళ్ల క్రితం 200 అడుగుల స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రత్యేకంగా ఏనుగుల కోసమే నిర్మించారు. అయితే దీని గోడలు గాజుతో చేయడం వల్ల పర్యాటకులు ఏనుగుల జలకాలాటను దగ్గరగా చూడొచ్చు.


చేపల వేట

అన్ని చేపలూ ఒకేలా ఉండవు. ఆసియన్‌ కార్ప్‌గా పేరుతెచ్చుకున్న కోపి చేపలు ప్రమాదకరమైనవి. నదిలో వాతావరణాన్ని పాడుచేస్తాయి. నీళ్లలోంచి పది అడుగుల పైకి దూకి బోట్‌ డ్రైవర్లను భయానికి గురిచేస్తాయి. అమెరికాలోని బాత్‌ నగరంలో ఉన్న ఇల్లినాయిస్‌ నదిలో ప్రతి ఏటా కోపి చేపలను పట్టే టోర్నమెంట్‌ జరుగుతుంది. ఇందులో ఆటగాళ్లు వలలతో మాత్రమే ఈ చేపల్ని పడతారు. ఆ సమయంలో క్లిక్‌మన్న ఫొటో ఇది.

Updated Date - Aug 25 , 2024 | 08:32 AM

Advertising
Advertising
<