LPG Saving Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది..!
ABN, Publish Date - Jun 20 , 2024 | 06:55 PM
LPG Saving Tips: కట్టెల పొయ్యి కాలం పోయింది.. ఇప్పుడంతా గ్యాస్ సిలిండర్లదే రాజ్యం. గ్రామీణ ప్రాంతాల్లోని వంట గదుల్లోనూ గ్యాస్ సిలిండర్ ఆక్రమించేసింది. త్వరగా, రిస్క్ లేకుండా వంట చేసేందుకు ప్రజలందరూ గ్యాస్ సిలిండర్‌నే వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు..
LPG Saving Tips: కట్టెల పొయ్యి కాలం పోయింది.. ఇప్పుడంతా గ్యాస్ సిలిండర్లదే రాజ్యం. గ్రామీణ ప్రాంతాల్లోని వంట గదుల్లోనూ గ్యాస్ సిలిండర్ ఆక్రమించేసింది. త్వరగా, రిస్క్ లేకుండా వంట చేసేందుకు ప్రజలందరూ గ్యాస్ సిలిండర్‌నే వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగా చేరింది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సామాన్య కుటుంబ వినియోగం ప్రకారం.. 14 కేజీల సిలిండర్ ఒక రెండు నెలల పాటు వస్తుంది. వినియోగం ఎక్కువైతే.. సిలిండర్ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు కూడా గ్యాస్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే అదిరిపోయే చిట్కాలు తీసుకువచ్చాం. గ్యాస్‌ను ఈ విధంగా వినియోగిస్తే ఎక్కువ కాలం వస్తుంది. ఆ చిట్కాలేంటో చూసేద్దాం..
వంట గ్యాస్‌ను ఇలా ఆదా చేసుకోండి..
తడి ఆరిన వంటపాత్రలు: సహజంగానే చాలా మంది వంట చేసేటప్పుడు వాటిని కడిగి తడి పాత్రలనే గ్యాస్‌పై పెడుతారు. అలాంటప్పుడు ఆ పాత్ర ఆరడానికి, వేడెక్కడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇది కూడా గ్యాస్ ఎక్కువ వినియోగానికి కారణం అవుతుంది. అందుకే తడి పాత్రల నీటిని తుడిచిన తరువాత మాత్రమే వినియోగించాలి.
ఆహారాలను నానబెట్టడం: అన్నం, పప్పు వంటివి వండినప్పుడు.. వాటిని ముందుగా నానబెట్టాలి. అలా చేయడం ద్వారా తక్కువ గ్యాస్ వినియోగంలోనే వంట పూర్తవుతుంది. అలాగే ప్రెజర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల కూడా గ్యాస్ సేవ్ అవుతుంది.
తక్కువ ఫ్లేమ్‌లో వంట చేయడం: మంట ఎక్కువగా ఉన్నప్పుడు.. గ్యాస్ వేడి రూపంలో వృధా అవుతుంది. పాత్ర అడుగును దాటుకుని వచ్చే అదనపు మంట వల్ల గ్యాస్ వృధా అవుతుంది. అలా కాకుండా తక్కువ ఫ్లేమ్‌లో వంట చేస్తే 25 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుంది.
వంట చేసేటప్పుడు మూతలను ఉపయోగించాలి: వంట చేసేటప్పుడు పాత్రపై మూత తప్పనిసరిగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల వంట త్వరగా అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మూత తెరిచి పెట్టడం వలన వండే వంట త్వరగా ఉడకదు. తద్వారా గ్యాస్ వినియోగం అధికమవుతుంది. అందుకే.. వంట చేసేటప్పుడు పాత్రలపై తప్పకుండా మూత పెట్టాలి.
లీకేజ్: అన్నింటికంటే ముఖ్యమైంది లీకేజ్. మీరు వినియోగిస్తున్న గ్యాస్ లీకేజీ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. గ్యాస్ లీకేజ్ ఉంటే అది త్వరగా అయిపోతుంది. అందుకే లీకేజీ లేకుండా చూసుకోవాలి.
బర్నర్స్ క్లీనింగ్: బర్నర్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. రోజూ వినియోగం కారణంగా బర్నర్స్‌లో మసి ఏర్పడుతుంది. ఇది గ్యాస్ సరఫరాకు అవరోధంగా మారుతుంది. ఫలితంగా మంట సరిగా రాదు. గ్యాస్ వృధా అవుతుంది. అందుకే.. ఎప్పటికప్పుడు బర్నర్స్‌ని క్లీన్ చేయాలి.
For More Special News and Telugu News..
Updated Date - Jun 20 , 2024 | 06:55 PM