ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఓటరుకు, ప్రజాస్వామ్యానికి పెళ్లి.. వైరల్ అవుతున్న వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్!

ABN, Publish Date - Apr 30 , 2024 | 01:52 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ అలుముకుంది. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సీజన్, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంతా సందడి సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వివాహ ఆహ్వాన పత్రికను వెరైటీగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డిజైన్ చేశారు.

Unique wedding card

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల (Elections) ఫీవర్ అలుముకుంది. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్‌సభ (Lok Sabha Elections) ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సీజన్, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంతా సందడి సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వివాహ ఆహ్వాన పత్రికను (Wedding card) వెరైటీగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డిజైన్ చేశారు. ఆ వెరైటీ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌ (Viral)గా మారింది. ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు ఇలా క్యాపెంయిన్ చేస్తున్నారు.


వైరల్ అవుతున్న ఆ వెడ్డింగ్ కార్డ్‌లో వధూవరుల పేర్లకు బదులు ప్రజాస్వామ్యం, ఓటరు అని రాసి ఉండడం విశేషం. అలాగే పెళ్లి వేదిక ప్లేస్‌లో ``మీ పోలింగ్ కేంద్రం`` అని రాసి ఉంది. r/unitedstatesofindia రెడిట్ ఖాతాలో పోస్ట్ అయిన ఆ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా వెరైటీగా శుభలేఖను ముద్రించి పుణె వాసులను ఓటింగ్ కోసం సన్నద్ధం చేస్తున్నారు. ``రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం, మన దేశాన్ని సుసంపన్నం చేసే దిశగా ముందడుగు వేయాలంటే, పార్లమెంటుకు మన గళాన్ని తెలియజేయాలి. ప్రతి ఓటు ముఖ్యమే`` అంటూ ఆ శుభలేఖలో పేర్కొన్నారు.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ శుభలేఖపై యూజర్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే ఫైన్ విధిస్తారు``, ``ఓటు వేయండి.. నోటాకు అయినా ఓటు వేయండి``, ``వివాహ కార్డుతో ఓటింగ్ అవగాహన బాగుంది``, ``ఇంత క్రియేటివిటీ అవసరం లేదు. ఓటు వేయాలనే ఇంగిత జ్ఞానం ప్రజలకు ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి.. ఈ ఫొటోలో హెడ్ ఫోన్స్ ఎక్కడున్నాయో కనిపెట్టండి!


Viral Video: అబ్బబ్బా.. వరుడు ఎంత అదృష్టవంతుడో.. అతడి మెడలో వేసిన దండను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2024 | 01:52 PM

Advertising
Advertising