Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే
ABN, Publish Date - May 12 , 2024 | 02:45 PM
వుడు అన్నిచోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే అమ్మ.. ఎవరికైనా అమ్మే. ఇంకా చెప్పాలంటే.. అమ్మను సృష్టించిన సృష్టికర్త లేరనే వారు ఈ భూమండలం మీద ఉన్నారేమో కానీ.. అమ్మే లేదనే వారు ఒక్కరు కూడా ఈ ధరణితలం మీద లేరంటే అతిశయోక్తి కాదేమో.
దేవుడు అన్నిచోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే అమ్మ.. ఎవరికైనా అమ్మే. ఇంకా చెప్పాలంటే.. అమ్మను సృష్టించిన సృష్టికర్త లేరనే వారు ఈ భూమండలం మీద ఉన్నారేమో కానీ.. అమ్మే లేదనే వారు ఒక్కరు కూడా ఈ ధరణితలం మీద లేరంటే అతిశయోక్తి కాదేమో.
ఏ కుటుంబంలోనైనా బంధాలు, అనుబంధాలు, బంధుత్వాల మధ్య అమ్మ పాత్ర ఎప్పటికి నిత్య నూతనమే. అమ్మ వంటింటికే పరిమితమనుకున్నా.. ఆ గదిలో వంట పాత్రలకే కాదు.. ఆ కుటుంబ సభ్యుల పాత్రలకు సైతం సమయోచితంగా ఎంత విలువ ఇవ్వాలో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి అమ్మ.
Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..
అమ్మ ఒక్కరే అయినా.. ఆమె పోషించే పాత్రలు అనేకం. గృహణిగా, తల్లిగా, సోదరిగా, భార్యగా.. ఇలా ఎన్నో పాత్రల్లో తనకు తెలియకుండానే ఒదిగిపోయి.. ఆ కుటుంబ ఎదుగుదలకు ఊపిరిలూదుతోంది. ఏ ఇంట్లో అయినా తండ్రి ప్రధానమే అయినా.. ఆ ఇంటిలోని అన్ని బాధ్యతలు తనకు తెలియకుండానే అమ్మ తన భుజాన వేసుకొంటుంది. ఏ కుటుంబంలోని పెద్ద ఎలా ఉన్నా.. ఆ ఇంటి ఇల్లాలు పొందికగా ఉంటే.. ఆ ఇల్లే స్వర్గ సీమగా మారుతుంది.
కడుపులో నలుసుగా పడిన నాటి నుంచి నవ మాసాలు మోసి.. వాళ్లు భూమి మీద పడిన నాటి నుంచి వారిని పెంచి పెద్ద చేసే క్రమంలో ఆ కన్న తల్లి.. తన ప్రాణాలతో సైతం పోరాడుతుంది. ఆ క్రమంలో అవసరమైతే కాలానికి సైతం ఎదురు తిరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే కన్నతల్లిగా.. తన పిల్లల కోసం సర్వస్వం దారపోస్తుంది. పిల్లలు ఎదిగితే.. తాను ఎదిగినట్లుగానే సంతోషిస్తుంది. తల్లి క్రమశిక్షణతోపాటు ఆర్థిక క్రమశిక్షణతో మసులు కుంటే.. ఇక ఆమె కనుసన్నల్లో పెరిగే పిల్లలు ఆత్మాభిమానంతో నిండుకుండాలా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని కవులంతా తల్లి గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.
ప్రపంచంలో ఏ తల్లి అయిన ఏ బాధనైనా భరిస్తుంది కానీ.. కడుపు కోతను మాత్రం భరించలేదంటూ శకుంతలోపాఖ్యానంలో ఆదికవి నన్నయ్య చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఏ ఇంట్లో అమ్మా నాన్నాలు సమానమే అయినా.. ఆ ఇంట్లో పిల్లలకు మాత్రం అమ్మ కొంచెం ఎక్కువ.
అందుకే ప్రపంచంలో నిటారుగా ఉన్న ప్రతీ వెన్నుముక జీవికి ఏ చిన్న పాటి దెబ్బ తిగిలినా.. వారికి తెలియకుండానే వారి రెండు పెదాలు కలిసిపోయి.. అమ్మ అనే పదాన్ని ఉచ్చరిస్తాయి. ఈ విషయాన్ని సృష్టికర్త గమనించే.. అమ్మను ఈ భూ మండలం మీదకు పంపి ఉంటాడు. మే 12, ఇంకా చెప్పాలంటే.. మే రెండో ఆదివారం మాతృత్వ దినోత్సవం. హ్యాపీ మదర్స్ డే.
Read Latest National News And Telugu News
Updated Date - May 12 , 2024 | 02:53 PM