ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health: ఏటా పెరిగిపోతున్న కంటి సమస్యలు.. అలా చేయడమే ప్రధాన కారణమా..?

ABN, Publish Date - Jan 09 , 2024 | 04:18 PM

ప్రపంచ వ్యాప్తంగా దృష్టి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకార లోపం, సరైన అవగాహన లేకపోవడం

ప్రపంచ వ్యాప్తంగా దృష్టి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకార లోపం, సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. దృష్టి లోపాన్ని పరిష్కరించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్య. రోజువారీ ఆహారపు అలవాట్లు కంటి చూపును ప్రభావితం చేస్తున్నాయి. వాటిని సకాలంలో పరిష్కరించకపోతే మరింత సంక్లిష్టంగా మారి, ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారు. ఇలా గంటలకు గంటలకు స్క్రీన్ ను చూడడం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితులు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కు కారణమవుతోంది. 20-20-20 పద్ధతి ద్వారా కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చు. అంటే ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్లు 20 అడుగుల దూరంలో ఉన్నవస్తువులను తదేకంగా చూడడం.

కంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, సీ, ఈ విటమిన్లు, ముదురు రంగు ఆకుకూరలు, గింజలు, గుడ్లు, ఆరెంజ్, సీ ఫుడ్ ను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, బలహీనమైన రోగనిరోధక శక్తి, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో సహా స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల కళ్లు నొప్పి పెడతాయి. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, వస్తువులు మసకగా కనిపించడం, పొడి కళ్లు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోజూ 7 గంటల నుంచి 9 గంటల వరకు మంచి నిద్ర చాలా అవసరం.


కళ్లను రుద్దడం వల్ల దృష్టికి కొంత నష్టం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల కనురెప్పల కింద ఉన్న రక్తనాళాలు చిట్లిపోతాయి. చికాకుగా ఉన్నప్పుడు, కళ్లను రుద్దడానికి బదులుగా కోల్డ్ కంప్రెస్‌ చేయాలి. అతినీలలోహిత కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోవడానికి సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మాక్యులర్ డీజెనరేషన్ లేదా కంటిశుక్లం ఏర్పడకుండా చూసుకోవచ్చు. అంతకు మించి, సన్ గ్లాసెస్ ధరించడం ద్వారా గాలిలోని దుమ్ము ధూళి కణాలు పడకుండా ఉంటుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 04:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising