Irfan pathan's wife: ఇర్ఫాన్ పఠాన్ అర్ధాంగి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
ABN, First Publish Date - 2024-02-06T15:22:53+05:30
దుబాయ్‌లో పెరిగిన ఇర్ఫాన్ పఠాన్ భార్య గతంలో మోడల్, నెయిల్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pthan) ఇటీవలే తొలిసారిగా తన భార్య సఫా బెయిగ్ (Safa baig) ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, నెట్టింట పెద్ద సంచలనమే రేగింది. గతంలో చాలా సార్లు ఇర్ఫాన్ తన కుటుంబం చిత్రాలు షేర్ చేశాడు కానీ వాటన్నిటిలో ఆయన భార్య సంప్రదాయ వస్త్రధారణలో ఉండేది. ఆమె ముఖం కనిపించేది కాదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ భార్య ఎవరు? గతంలో ఏం చేసేవారు అన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి.
మీడియా కథనాల ప్రకారం, సఫా బెయిగ్‌ను ఇర్ఫాన్ 2014లో తొలిసారిగా దుబాయ్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో కలుసుకున్నాడట. 1994లో పుట్టిన సఫా చిన్నతనం సౌదీ అరేబియాలోని జెద్దాలో గడిచింది. అక్కడే ఆమె ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో చదువుకుంది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సఫా ఒకప్పుడు దుబాయ్‌లో చాలా ఫేమస్ మోడల్. దుబాయ్‌తో పాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల్లోని పలు ఫ్యాషన్ మ్యాగజైన్లలో ఆమె కవర్ ఫొటోలు కనిపించాయి. మోడల్ గానే కాకుండా ఆమెకు నెయిల్ ఆరిస్ట్రీలో కూడా మంచి ప్రావీణ్యం ఉందని జాతీయ మీడియా చెబుతోంది.
2016లో ఇర్ఫాన్, సఫాల వివాహం జరిగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, ఇతర క్రికెటర్లలాగా తన కుటుంబం పొటోలు పంచుకోనందుకు ఇర్ఫాన్‌పై గతంలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజా ఫొటోతో ఇర్ఫాన్ పఠాన్ ఆ విమర్శలన్నిటికీ ముగింపు పలికాడు.
కెరీర్‌లో కూడా ఇర్ఫాన్ టీమిండియాకు కీలకంగా వ్యవహరించాడు. 2007లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా కేవలం 15 బంతులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. దాదాపు 11 సంవత్సరాల క్రితం అతడు తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు చెప్పాడు. కెరీర్‌లో ఇర్ఫాన్ భారత్ తరపున 29 టెస్టులు, 150 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Updated Date - 2024-02-06T15:39:21+05:30 IST