మొబైల్ మెరుపులు
ABN, Publish Date - Nov 24 , 2024 | 10:52 AM
అందాల తారలు అనన్య పాండే, ఖుషీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో తెగ వైరలైంది. వారి ఔట్‌ఫిట్స్, హెయిర్ స్టైల్ లేదా జ్యువెలరీ గురించే సెర్చింగ్ అనుకుంటే ఈ ఫ్యాషన్ దునియాలో మీరు వెనకపడ్డట్టే. ఎందుకంటే ఆ భామల చేతిలో ఉన్నది ‘మొబైల్ చార్మ్స్’. అంటే మొబైల్ గొలుసులన్నమాట. చేతికి బ్రాస్‌లెట్‌లాగే ఫోన్‌కు ఇదో ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఇదే సరికొత్త ట్రెండ్.

- ‘మొబైల్ చార్మ్స్’ ట్రెండ్ మొదట జపాన్‌లో ప్రారంభమైంది. వీటిని ‘కీటై స్ట్రాప్స్’ అని పిలుస్తారక్కడ. ఇది చెడు నుంచి రక్షణ కల్పించడమే గాక, అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం.
- మనం ఎంచుకొనే ఫోన్ చార్మ్‌లు.. మన వ్యక్తిత్వాన్ని, అభిరుచిని, ఆసక్తిని ప్రతిబింబిస్తాయట.
- ఇవి ఫోన్లకు స్టైలిష్ లుక్‌ను అందించడమే గాక భద్రతను కూడా కల్పిస్తాయి. సాధారణంగా ఎక్కడపడితే అక్కడే మొబైల్ ఫోన్‌లను మరిచిపోతుంటాం లేదా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో చేయి జారి పోతుంటాయి. అలాంటి సందర్భాల్లో మొబైల్ చార్మ్స్ కొంత రక్షణను అందిస్తాయి. వీటిని ఎంచక్కా మణికట్టుకు తగిలించుకుంటే సరి.
- వివిధ రకాల పూసలు, రాళ్లతో పాటు విభిన్న మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఎవిల్ ఐ, ఎంచుకునే పేర్లతో కస్టమైజ్డ్ ఫోన్ చార్మ్‌లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
- వీటిని కేవలం ఫోను అలంకరణకే కాదండోయ్... హ్యాండ్ బ్యాగ్, పర్సు, కెమెరా, ఇయర్‌పాడ్స్‌కు కూడా తగిలించొచ్చు.
- ఫోన్‌కేస్‌కు ఉన్న స్లాట్స్‌లో అంటే... కెమెరా, వాల్యూమ్, స్పీకర్, పవర్ బటన్ లేదా ఇతర రంధ్రాల ద్వారా వీటిని సులువుగా తగిలించొచ్చు.
- మొబైల్ చార్మ్‌కు 30 శాతం డిమాండ్ పెరిగిందని వివిధ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఎంక్వయిరీలు వస్తున్నాయని మొబైల్ షాపుల నిర్వాహకులు అంటున్నారు. త్వరలోనే ఈ ట్రెండ్ మిగతా నగరాల్లో కూడా ఊపందుకునే అవకాశాలున్నాయి. మొత్తానికి అమ్మాయిలకు మరో ఫ్యాషన్ యాక్ససరీస్ దొరికింది.
Updated Date - Nov 24 , 2024 | 10:52 AM