ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Monkey iPhone: లంచం ఇస్తేనే ఐఫోన్ ఇస్తా.. కోతి చేసిన కొంటె పనికి దిమ్మతిరగాల్సిందే!

ABN, Publish Date - Jan 17 , 2024 | 05:05 PM

కొంటె పనులకు మారుపేరైనా కోతులు అప్పుడప్పుడు మనుషులను కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎవరి చేతిలో అయినా తినుబండారాలు గానీ, ఇతర వస్తువులు గానీ కనిపిస్తే చాలు.. ఒక్కసారిగా దూసుకొచ్చి వాటిని ఎత్తుకెళ్లిపోతాయి. కానీ.. కొన్ని కోతులు మాత్రం ఆట పట్టిస్తాయి.

కొంటె పనులకు మారుపేరైన కోతులు అప్పుడప్పుడు మనుషులను కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎవరి చేతిలో అయినా తినుబండారాలు గానీ, ఇతర వస్తువులు గానీ కనిపిస్తే చాలు.. ఒక్కసారిగా దూసుకొచ్చి వాటిని ఎత్తుకెళ్లిపోతాయి. కానీ.. కొన్ని కోతులు మాత్రం ఆట పట్టిస్తాయి. వస్తువులు లాక్కున్న తర్వాత.. తమకు తినడానికి ఏదైనా ఇస్తేనే ఆ వస్తువుల్ని తిరిగిస్తామని డిమాండ్ చేస్తాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఐఫోన్ లాక్కున్న ఒక కోతి.. చివరికి ఓ ఒప్పందం మేరకు దానిని తిరిగి ఇచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న శ్రీ రంగనాథ్ జీ మందిరాన్ని సందర్శించడానికి ఒక వ్యక్తి వెళ్లారు. అయితే.. ఇంతలో ఒక వానరం సడెన్‌గా దూసుకొచ్చి, ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ లాక్కుంది. అనంతరం ఒక నిర్మాణం పైకి ఎక్కి కూర్చుంది. పక్కనే మరో కోతి, దాని చేతిలో ఏముందా? అని గమనిస్తూ ఉంది. మరోవైపు.. ఆ కోతి వద్ద నుంచి తన ఫోన్‌ని తిరిగి ఎలా పొందాలా? అని ఆ వ్యక్తి ఆలోచనలో పడిపోయాడు. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన తట్టింది. తినడానికో, తాగడానికో ఏదో ఒకటి ఇస్తే.. ఆ కోతి తన ఫోన్ తిరిగి వస్తుందని భావించాడు. అంతే.. వెంటనే ఫ్రూటీ కొనుగోలు చేసి, దాంతో ఆ కోతిని ఊరించసాగాడు. అయితే.. అది మరీ ఎత్తులో ఉండటంతో కిందకు దిగిరాలేదు. దీంతో.. ఆ వ్యక్తే ఫ్రూటీని పైకి విసిరాడు. తొలి రెండు ప్రయత్నాలు విఫలమైనా, మూడో ప్రయత్నంలో మాత్రం అది నేరుగా కోతి చేతిలోకి వెళ్లింది. అప్పుడు దాన్ని అందుకోబోయి, తన చేతిలో ఉన్న ఐఫోన్‌ని ఆ కోతి వదిలేసింది. ఇలా ఫ్రూటీ రూపంలో లంచం ఇచ్చి, ఆ వ్యక్తి తన ఫోన్ తిరిగి పొందాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బృందావన్ కోతులు ఇలాగే ఉంటాయని.. ఒక ఫ్రూటీతో ఐఫోన్‌ని అది ట్రేడ్ చేసిందని.. దీనిని వస్తుమార్పిడి విధానం అంటారని యూజర్లు పేర్కొంటున్నారు. తమ ఆహారం ఎలా పొందాలనే దానిపై కోతులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాయని.. ఫ్రూటీతో డీల్ కుదుర్చుకుని ఆ వానరం ఐఫోన్‌ని తిరిగి ఇచ్చిందని కామెంట్లు చేశారు. మరొక యూజర్ ఏమో.. బృందావన్ కోతులు ఉత్తమ వ్యాపారులు (బెస్ట్ ట్రేడర్స్) అని.. ట్రేడింగ్‌లో అవి ఫ్రొఫెషనల్‌గా మారాయని చెప్పుకొచ్చారు. కాగా.. కొన్ని నెలల క్రితం బాలిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రెండు పండ్లు అందించిన తర్వాతే.. మహిళ ఫోన్‌ను ఒక కోతి తిరిగిచ్చింది.

Updated Date - Jan 17 , 2024 | 05:34 PM

Advertising
Advertising