ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fact check: కుర్చీ తాతను వాడుకుని రోడ్డున పడేశారు.. యూట్యూబ్ ఛానళ్లపై నెటిజన్ల ఫైర్..

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:21 PM

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో.. ఆ కుర్చీని మడతబెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో.. ఆ కుర్చీని మడతబెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యారు. కుర్చీ తాత అని పేరు కూడా పెట్టేశారు నెటిజన్లు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఏకంగా ఆ కుర్చీని మడతబెట్టి.. పాటను పాడే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోని సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఒక్కసారిగా కుర్చీ తాత మరోసారి ట్రెండ్ అయ్యారు. దీంతో అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. తాజాగా ఆయన ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. నన్ను కుర్చీ తాత అంటారండి.. నాకు ఇవ్వడానికి రూపాయి కూడా లేదా అంటూ ఈయన యాచిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ఏకంగా యూట్యూబ్ ఛానళ్లపై మండిపడ్డాడు. కొన్ని దొంగ యూట్యూబ్ ఛానళ్లు ఆయనను వాడుకుని.. ఇప్పుడు రోడ్డున పడేశాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి కుర్చీతాత నెట్టింట చక్కర్లు కొడుతున్నాడు. మరికొందరు మాత్రం ఇది సినిమా ప్రమోషన్లలో భాగమేనని, ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా.. మంచి పాపులారిటీ తెచ్చుకున్న కుర్చీ తాత.. ప్రస్తుత పరిస్థితిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 12:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising