Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’
ABN, Publish Date - May 03 , 2024 | 09:12 AM
ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు, దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ సంచలన విషయం బయటపడింది.
ఉత్తర కొరియా (North Korea) అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకునే నిర్ణయాలు, దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ సంచలన విషయం బయటపడింది. కిమ్ జోంగ్ శారీరక సుఖాల కోసం ఓ ``ప్లెజర్ స్క్వాడ్``ను (Pleasure Squad) ప్రతి ఏడాది తయారు చేస్తున్నట్లు బయటికొచ్చిన వార్త సంచలనం సృష్టించింది. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ (Yeonmi Park) అనే యువతి కిమ్ జోంగ్కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది.
కిమ్‌ను సంతోష పెట్టేందుకు ప్రతి ఏడాది 25 మంది అందమైన, వర్జిన్ అమ్మాయిలతో కూడిన ``ప్లెజర్ స్క్వాడ్``ను తయారు చేస్తున్నారని వెల్లడించింది. అమ్మాయిల అందం, వారి కుటుంబ నేపథ్యం ఆధారంగా అమ్మాయిలను ఎంపిక చేస్తారని, అనంతరం వర్జినిటీ టెస్ట్ చేయించి 25 మందిని తీసుకుంటారని పార్క్ వెల్లడించింది. ``అమ్మాయిల కోసం స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారు. అందమైన వారు ఎవరైనా స్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్లలో కూడా తనిఖీ చేస్తారు. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారు. దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారు. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు, దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న కుటుంబాల అమ్మాయిలను ``ప్లెజర్ స్క్వాడ్`` లోకి తీసుకునేవారు కాద``ని పార్క్ వివరించింది.
``అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేయిస్తారు. చిన్న లోపాన్ని గుర్తించినా వారిని పక్కనపెట్టేస్తారు. కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగ్యాంగ్కు పంపి కొన్ని అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ అమ్మాయిలు నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుంది. ఆ 25 మంది అమ్మాయిలను 3 బృందాలుగా విడగొడతారు. ఒక బృందానికి మసాజ్ చేయడంలో శిక్షణ ఇస్తారు. మరో బృందానికి పాటలు, డ్యాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు. ఇక మూడో సమూహం నియంత కిమ్, ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోర్కెలు తీర్చాల్సి ఉంటుంది. పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుంద``ని పార్కర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 03 , 2024 | 09:53 AM