Guinness Record: 12 గంటల పాటు ట్రెడ్ మిల్‌పై పరుగెత్తి వరల్డ్ రికార్డు!
ABN, Publish Date - Apr 11 , 2024 | 09:55 PM
ఒడిశాకు చెందిన అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ట్రెడ్ మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాకు చెందిన అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ట్రెడ్ మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి గిన్నిస్ రికార్డు (Guinness Records) సొంతం చేసుకున్నాడు. మార్చి 12న ఉదయం 8.15 గంటలకు పరుగు ప్రారంభించి రాత్రి 8.20 గంటల వరకూ కొనసాగించాడు. మొత్తం 68.04 కిలోమీటర్లు పరిగెత్తి ఎండ్యూరెన్స్ క్రీడల విభాగంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
Viral: ఆపరేషన్ సందర్భంగా పాట ప్లే చేసిన డాక్టర్ .. ఎందుకో తెలిస్తే..
అయితే సుమిత్‌కు ఇలాంటి రికార్డులు కొట్టిన పిండే. గతంలో అతడు కేవలం నెల రోజుల వ్యవధిలో 33 పూర్తిస్థాయి మారథాన్లలో పాల్గొన్నాడు. గతేడాది ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకూ పలు మారథాన్లలో పాల్గొన్న అతడు ఏకంగా 1392.6 కిలోమీటర్ల మేర మారథాన్ పరుగు పూర్తి చేశాడు. దీంతో, అతడికి గిన్నిస్ రికార్డు వరించింది. ప్రపంచంలో అత్యధిక పూర్తిస్థాయి మారథాన్‌లు పూర్తి చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
Viral: విమానంలో రెచ్చిపోయిన లవర్స్.. 4 ఖాళీ సీట్లను మంచంలా వాడేసుకుంటూ.. పబ్లిక్‌గా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 11 , 2024 | 10:05 PM