ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Famous Dishes : ప్రయాణాల్లో ఈ నోరూరించే సిటీ వంటకాలను ఎప్పుడైనా టేస్ట్ చేసారా..!

ABN, Publish Date - Jan 27 , 2024 | 12:46 PM

ఇల్లు వదిలి ఎక్కడికో ప్రయాణం కట్టే ప్రయాణికులకు కడుపు నింపే స్టేషన్ పరిసరాల్లోని వంటలు కూడా అంతే ఫేమస్ అయ్యాయంటే అక్కడి రుచితో పాటు, వాటిని తరాలుగా అందించడం కూడా ఓ కారణం.

Hyderabadi Biryani

ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆహార పదార్థం పేరును, గుర్తింపును తెచ్చిపెడుతుంది. అలా మైసూర్ పాక్, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంతాల పేరుతో రుచిలో హైలెట్‌గా నిలిచిన వంటకాలు ఎన్నో.. అలాగే హైదరాబాద్ అనగానే బిర్యానీ కూడా అంతే ఫేమస్. స్పైసీ హైదరాబాదీ బిర్యానీ అనగానే నోరు ఊరని వాళ్లంటూ ఉంటారా? ఇల్లు వదిలి ఎక్కడికో ప్రయాణం కట్టే ప్రయాణికులకు కడుపు నింపే స్టేషన్ పరిసరాల్లోని వంటలు కూడా అంతే ఫేమస్ అయ్యాయంటే అక్కడి రుచితో పాటు, వాటిని తరాలుగా అందించడం కూడా ఓ కారణం. ఇలా ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత కూడా కారణమని చెప్పచ్చు. ఇలానే ఒక్కోచోట ఒక్కో వంటకం ఫేమస్ .. ప్రయాణికులు ఆయా ప్రదేశాలకు వెళ్లినపుడు తప్పక తినే వంటకాల జాబితాను వెతికితే.. ఎన్ని నోరూరించే వంటకాలో తెలుసుకుందాం రండి..

స్పైసీ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ..

తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్‌లో బిర్యానీ ప్రియులకు ఇదో స్వర్గధామం. స్పైసీ చికెన్ బిర్యానీ సుగంధ ద్రవ్యాలతో రైస్ డిష్‌గా అందరి ఆకలినీ తీరుస్తుంది.

మార్గోవో జంక్షన్, గోవా

మార్గోవా జంక్షన్ అక్కడి ఆహార పదార్థాలతో ఫేమస్ అయింది. కోస్తా రత్నం అంటే కొబ్బరి కూర, అన్నం, చేపలు ఇవన్నీ కలిపి తింటే చక్కని రుచితో కడుపుతో పాటు ఆ వంటకం కళ్లను కూడా నింపేస్తుంది.

జైపూర్ జంక్షన్.. రాజస్థాన్

ఇక్కడి రైల్వే స్టేషన్ లోని ప్యాజ్ కచోరి ఆహార ప్రియులకు ఇష్టమైన ఆహారం. రాజస్థానీ స్ట్రీట్ ఫుడ్‌గా పేరు పొందిన ఈ ఫుడ్ సువాసనతోనే సగం కడుపు నిండిపోతుంది.

చెన్నై సెంట్రల్ , తమిళనాడు

దక్షిణ భారతీయ అల్పాహారం, ఇడ్లీ సాంబార్‌ని అస్సలు మిస్ చేయరు. చెన్నై అంటేనే సాంబార్‌కి స్పెషల్.. అక్కడి కొబ్బరి చట్నీతో సాంబార్ తింటుంటే మనసు ఏటో పోతుంది. ఆరోగ్యంతో పాటు రుచికరమైన వంటకం మరి. ఈసారి అటుగా వెళితే తప్పక తిని రండి.

లక్నో జంక్షన్, ఉత్తర ప్రదేశ్..

లక్నో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఉత్తర ప్రదేశ్ వారసత్వంగా వస్తున్న ఈ బిర్యానీ అంటే అక్కడే కాదు. రుచికరమైన భోజనాన్ని ఇష్టపడే అందరికీ అభిమానమే. మాంసం, మసాలతో పాటుగా చేసే ఈ బిర్యానీ ఫేమస్ కావడానికి అక్కడి భోజన ప్రియులే కారణం.

ఇది కూడా చదవండి: ఇలా చేసి పసుపు పళ్లను వదిలించుకోవచ్చు.. ట్రై చేసి చూడండి..


వడోదర జంక్షన్, గుజరాత్

గుజరాత్‌లోని వడోదర జంక్షన్ తీపి కార్నర్. అటుగా వచ్చే ప్రయాణికుల నోరూరిస్తూ తయారయ్యే జలేబి తియ్యని రుచిని పంచుతుంది. ఇది గుజరాత్ ఫేమస్ జిలేబి వంటకం.

హౌరా జంక్షన్, కోల్ కతా

కోల్ కతాలోని హౌరా జంక్షన్ స్ట్రీట్ ఫుడ్‍కి ఫేమస్.. కోల్ కతాలోని పేరుగాంచిన కతీరోల్స్ పరాఠాలు, మసాలా కబాబ్ చుట్టానికి కన్నులకు పండగే. వీటి రుచి కూడా అదుర్స్.

అమృత్ సర్ జంక్షన్, పంజాబ్..

అమృత్ సర్ జంక్షన్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమృత్ సరి కుల్చా చూడగానే నోరూరుతుంది. గబుక్కున నోట్లో పెట్టుకోవాలనిపించే రుచి. ఈ స్టప్డ్., క్రిస్పీ డిలైట్స్, చోలే, లస్సీ పంజాబ్ స్పెషల్స్.. వారసత్వంగా రుచిని మోసుకువస్తున్నాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 27 , 2024 | 12:47 PM

Advertising
Advertising