Optical Illusion: మీ ఐక్యూ లెవెల్ రేంజ్ ఎంత? 12 సెకెన్లలో బొమ్మల మధ్య నిజమైన కుక్కను కనుక్కోండి చూద్దాం..!
ABN, Publish Date - Mar 26 , 2024 | 01:35 PM
ఆప్టికల్ ఇల్యూషన్ డిజిటల్ ప్రపంచంలో మెదడుకు, దృష్టికి ఛాలెంజ్ విసురుతున్న సరికొత్త వేదిక.
ఆప్టికల్ ఇల్యూషన్ డిజిటల్ ప్రపంచంలో మెదడుకు, దృష్టికి ఛాలెంజ్ విసురుతున్న సరికొత్త వేదిక. బోలెడు చిత్రాలు కళ్లను, మెదడును గందరగోళానికి గురిచేస్తుంటాయి. గ్రహణ శక్తి అధికంగా ఉన్నవారు తప్ప వీటిని అంత సులువుగా పరిష్కరించలేరు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫొటోలో మంచం మీద కొన్ని కుక్క బొమ్మలు ఉన్నాయి. ఈ కుక్క బొమ్మల మధ్య నిజమైన కుక్క ఒకటి ఉంది. దీన్ని కేవలం 12సెకెన్ల లోపు గుర్తించాలి. కుక్క బొమ్మలు, నిజమైన కుక్క రంగు రూపు అన్నీ ఒకేలాగున్నాయి. ఈ బొమ్మలను చాలా తరచి చూస్తే తప్ప గుర్తించలేరు. ఇకపోతే ఫొటోలో ఉన్న కుక్క బొమ్మలలో ఒక నిజమైన కుక్క దుప్పటికి తన శరీరాన్ని పూర్తీగా ఆనించి కూర్చుని ఉంది. 12సెకెన్లలోపు ఈ కుక్కను గుర్తించినవారి ఐక్యూ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయని, పరిశీలనా శక్తి, తీక్షణమైన దృష్టి ఉన్నవారిలో వీరూ ఉంటారని అంటున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 01:35 PM