Picture Puzzle: మీ దృష్టికి స్పెషల్ టెస్ట్.. ఈ రెండు చేపల్లోని మూడు తేడాలను 8 సెకెన్లలో కనుక్కోండి...
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:44 PM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో రెండు చేపలు నీటిలో ఈత కొడుతున్నాయి. చూడడానికి రెండు చేపలు ఒకే రంగులో ఒకే ఆకృతిలో ఉన్నాయి. అయితే ఆ రెండు చేపల్లో మూడు చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ చేపల మధ్యనున్న తేడాలు కనబడుతాయి. 8 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు చేపల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..
Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!
Brain Teaser: కేవలం 1 శాతం మందే సరైన జవాబు చెప్పారు.. ఈ ఫొటోలోని వ్యక్తుల్లో ఎవరు సేఫ్..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 03 , 2024 | 12:44 PM