Picture Puzzle: మీరు తెలివైన వారు అయితే.. ఈ ఫొటోలోని మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి...
ABN, Publish Date - Nov 17 , 2024 | 06:51 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక బస్సులో కొందరు ప్రయాణికులు వెళ్తున్నారు. ఆ బస్సు ముందు ఓ కారు వెళ్తోంది. అయితే ఆ ఫొటోలో మూడు చిన్న తప్పులున్నాయి. జాగ్రత్తగా గమనిస్తేనే ఆ ఫొటోలో ఉన్న మూడు తప్పులు కనబడతాయి. 10 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పులను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. 1)వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి పేపర్‌ను రివర్సల్లో చూస్తున్నాడు. 2)డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ లేడు 3)వర్షం లేకపోయినా వైపర్స్ తిరుగుతున్నాయి.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 17 , 2024 | 06:51 AM