ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramzan: రంజాన్ ఉపవాసంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

ABN, Publish Date - Mar 04 , 2024 | 08:20 AM

ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో రంజాన్ మాసం ఒకటి. ఇస్లామ్‌లో ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెలరోజులపాటు ముస్లిం సోదరులు ఉపవాసం, ప్రార్థన, సామూహిక భోజనాలతో గడుపుతారు. రంజాన్ ముగింపు ఈద్ అల్ - ఫితర్(ఉపవాసం విరమించే విందు) అనే వేడుకతో పూర్తవుతుంది. ఇది ఇస్లాంలోని రెండు ముఖ్యమైన సెలవుల్లో ఒకటి.

ఢిల్లీ: ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో రంజాన్ మాసం ఒకటి. ఇస్లామ్‌లో ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెలరోజులపాటు ముస్లిం సోదరులు ఉపవాసం, ప్రార్థన, సామూహిక భోజనాలతో గడుపుతారు. రంజాన్ ముగింపు ఈద్ అల్ - ఫితర్(ఉపవాసం విరమించే విందు) అనే వేడుకతో పూర్తవుతుంది.

నెలవంక ఆధారంగా రంజాన్ 29 లేదా 30 రోజులు పాటించాలా అనేది నిర్ణయమవుతుంది. ఈ ఏడాది రంజాన్ నెల మార్చి 11న ప్రారంభమై ఏప్రిల్ 9న ముగుస్తుంది. ముస్లింలు ఈ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సుహూర్ అనేది ఉదయానికి ముందు చేసే భోజనం. అయితే ఇఫ్తార్, ఖర్జూరాలు, నీరు ఉపవాసాన్ని ముగించే భోజనం. ఉపవాసం సందర్భంగా ఆరోగ్యం కాపాడుకోవడమూ ముఖ్యమే. ఇందుకోసం ఏం చేయాలంటే..

స్వీయ సంరక్షణ ఆచారాలు

1. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం

రంజాన్ మాసం కొన్ని సమయాల్లో సవాలుగా అనిపించవచ్చు. మిగతా రోజులతో పోల్చితే ఈ నెల రోజుల్లో దినచర్య మొత్తం మారిపోతుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వీయ సంరక్షణ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

2. కుటుంబంతో గడపండి

ఉపవాస సమయంలో కొందరు బయట ఉండటానికి ఇష్టపడతారు. రోజులో కొద్ది సేపు కుటుంబంతో గడపండి. ఇలా చేస్తే మానసికోల్లాసం పెంపొందుతుంది.

3. ఇఫ్తార్

ఇఫ్తార్‌ విందుతో శరీరానికి తగిన పోషకాలు, శక్తి వస్తాయి. ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం కొన్ని ఖర్జూరాలు లేదా పండ్లతో మీ ఉపవాసాన్ని ముగించండి. పోషకాలు అధికంగా ఉండే, హైడ్రేటింగ్ సూప్‌లు తాగండి. తృణ ధాన్యాలు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.


4. ఆధ్యాత్మిక ప్రతిబింబం, ధ్యానం

అల్లాకు చేరువయేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ధ్యానం, ప్రార్థన, ఖురాన్ పఠనం కోసం సమయాన్ని కేటాయించండి. ఇది దేవుడితో మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

లక్ష్యాలు నిర్దేశించుకోవడం, ప్రశంసలు వ్యక్తం చేయడం, క్షమాపణ కోరడం.. ఇవి ఆధ్యాత్మిక భావనను, ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి.

5. వ్యాయామం

రంజాన్ మాసంలో శారీరక శ్రమ కూడా ముఖ్యమే. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి ఉపయోగపడుతుంది. తేలికపాటి నడక కూడా మంచిదే. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రంజాన్ మాసాన్ని గడిపేయవచ్చు.

Updated Date - Mar 04 , 2024 | 08:42 AM

Advertising
Advertising