ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 11:07 AM

ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలు ఎందరో పారిశ్రామిక వేత్తలను తయారు చేశాయి.

Ratan Tata’s letter to PV Narasimha Rao

దేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధిని సాధించడంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) పాత్ర అత్యంత కీలకమైనది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలను (Economic reforms) అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలు ఎందరో పారిశ్రామిక వేత్తలను తయారు చేశాయి. అప్పటికే పారిశ్రామిక దిగ్గజంగా ఉన్న రతన్ టాటా (Ratan Tata) కూడా పీవీ దార్శనికతను కొనియాడారు. ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీని ప్రశంసిస్తూ ఆయనకు 1996లో ఓ లేఖ రాశారు.


ఆ లెటర్‌ను తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ లేఖను టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం అయిన బాంబే హౌస్‌లో 1996, ఆగస్ట్ 27న రతన్ టాటా రాశారు. ఆ లేఖలో రతన్ టాటా.. పీవీ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసించారు. ``ప్రతి భారతీయుడు కృతజ్ఞతతో మీకు రుణపడి ఉండాల``ని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ప్రాధాన్యాన్ని పెంచే ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం పీవీ సాధించిన గొప్ప విజయం అని టాటా ప్రశంసిచారు. ఎవరు మర్చిపోయినా తాను మాత్రం పీవీ దార్శనికతను ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నారు.


``ఈ సమయంలో నా అభినందనలు, శుభాకాంక్షలు మీకు ఉంటాయని తెలియజేయడం కోసమే ఈ లెటర్ రాస్తున్నాను. దేశం కోసం మీరు ఏమి చేశారో అర్థం చేసుకున్న వ్యక్తి, మర్చిపోని వ్యక్తి ఒక్కరైనా ఉన్నారని మీకు తెలియజేయడం కోసమే ఈ లెటర్ రాస్తున్నాను`` అంటూ రతన్ టాటా ఆ లేఖలో పేర్కొన్నారు. 1996లో పీవీ నరసింహారావుపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రతన్ టాటా ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. రతన్ టాటా ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..

Viral Video: ఇదెక్కడి చిత్రం.. రూ.90 వేలతో బైక్ కొన్నాడు.. రూ.60 వేలతో ఊరేగింపు చేశాడు..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 11:07 AM