ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Save Money: బస్సు టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే మీ డబ్బు ఆదా చేసుకోవచ్చు.. లేదంటే మీరు మోసపోయినట్లే

ABN, Publish Date - Sep 30 , 2024 | 05:37 PM

ఒకసారి యాప్ ద్వారా టికెట్ బుక్‌ చేసుకోవడానికి అలవాటుపడిన ప్రయాణీకుడు తరువాత నుంచి అదే యాప్‌తో టికెట్లు బుక్ చేయడానికి అలవాటుపడుతున్నారు. యాప్ ద్వారా టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవడంతో పాటు చెల్లింపుల ప్రక్రియ సులభంగా ఉండటంతో బస్సు టికెట్లను యాప్స్‌ ద్వారా బుక్ చేసుకుంటుంటారు. కొందరు గ్రామీణ ప్రాంతాల ప్రజలు లేదా మొబైల్ యాప్‌లో ..

BUS tickets Booking

బస్సు టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చంటూ భారీ ప్రకటనలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో యాప్స్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు అలవాటుపడుతున్నారు. యాప్‌కు అలవాటుపడేవరకు.. మొదటి బుకింగ్‌కు బారీ డిస్కౌంట్ ఇస్తూ ప్రయాణీకులను తమవైపు ఆకర్షించుకుంటున్నాయి. ఒకసారి యాప్ ద్వారా టికెట్ బుక్‌ చేసుకోవడానికి అలవాటుపడిన ప్రయాణీకుడు తరువాత నుంచి అదే యాప్‌తో టికెట్లు బుక్ చేయడానికి అలవాటుపడుతున్నారు. యాప్ ద్వారా టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవడంతో పాటు చెల్లింపుల ప్రక్రియ సులభంగా ఉండటంతో బస్సు టికెట్లను యాప్స్‌ ద్వారా బుక్ చేసుకుంటుంటారు. కొందరు గ్రామీణ ప్రాంతాల ప్రజలు లేదా మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేయడం రానివాళ్లు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ లేదా ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించి టికెట్లు బుక్ చేసుకుంటారు. యాప్స్ లేదా ట్రావెల్ ఏంజెంట్ల ద్వారా కొనుగోలు చేసే టికెట్లు సాధారణ ధరతో పోలిస్తే అధికంగా ఉంటాయి. కానీ ప్రయాణీకులు యాప్‌లో తక్కువ ధరకు బుక్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉండటం, కంపెనీల ప్రకటనలకు ఆకర్షితులు కావడంతో యాప్ ద్వారా ధర ఎక్కువైనా టికెట్లు బుక్ చేస్తుంటారు. సాధారణంగా టికెట్ ధరతో పోలిస్తే యాప్‌ లేదా ట్రావెల్ ఏజెంట్ దగ్గర కొనుగోలు చేసే టికెట్ రూ.100 నుంచి రూ.200 అధికంగా ఉంటుంది.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్


తేడా ఇదే..

ట్రావెల్స్ యాజమాన్యం బస్సు టికెట్ ధరను నిర్ణయిస్తాయి. దీనిని టికెట్ సాధారణ ధరగా పేర్కొంటాం. ఆ టికెట్‌ను సంబంధిత ట్రావెల్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఒక్కో ట్రావెల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉండవు. యాప్ నిర్వహణ ఖర్చు అధికంగా ఉండటంతో వెబ్‌సైట్‌లో టికెట్లను అందుబాటులో ఉంచుతారు. కొన్ని యాప్‌లు బస్సు యాజమాన్యాలతో అనుసంధానమై టికెట్లను తమ యాప్‌లో అందుబాటులో పెడతాయి. ఈ టికెట్ సాధారణ ధరను యాజమాన్యానికి చెల్లిస్తాయి. సాధారణ ధర కంటే యాప్‌లు కొంచెం అధిక ధరను వసూలు చేస్తాయి. సర్వీస్ ఫీజు పేరుతో కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. యాప్ సేవలను ఉపయోగించుకున్నందుకు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే నేరుగా వెబ్‌సైట్‌లో టికెట్ కొనుగోలు చేస్తే సర్వీస్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్


డబ్బులు ఆదా..

హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాలంటే ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ ధర అన్ని ఛార్జీలతో కలిపి రూ.1158, ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.1158 చెల్లిస్తే సరిపోతుంది. అదే బస్సులో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం టికెట్‌ను ప్రయివేట్ ట్రావెలింగ్ యాప్ ద్వారా బుక్ చేస్తే రూ.1246 చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా రూ.88 చెల్లించాల్సి వస్తుంది. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే రూ.88 ఆదా చేసుకోవచ్చు. వాస్తవానికి యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో టికెట్ ధర తక్కువుగానే చూపిస్తుంది. చెల్లింపులు చేయడానికి వెళ్లినప్పుడు మనకు చూపించిన ధర కంటే ఎక్కువ ధర చూపిస్తుంది. అన్ని వివరాలు పూర్తిచేసి చెల్లింపులు చేయడానికి చివరి దశలో ఉన్న నేపథ్యంలో వెనక్కి వెళ్లలేక, ఒకవేళ టికెట్లు అయిపోతాయనే భయంతో ఎక్కువ ధర చూపించినా కొనుగోలు చేస్తాం. అందుకే నేరుగా బస్సు యాజమాన్యానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా, ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లలో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చు.


Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 30 , 2024 | 05:37 PM