Viral Video: పార్టీకి వెళ్లాక లీవ్ కోసం.. మధ్యలో బాస్‌కు మెసేజ్ చేసిన ఉద్యోగి.. అక్కడి నుంచి వచ్చిన సమాధానం చూస్తే..
ABN, Publish Date - Jan 02 , 2024 | 07:14 PM
చాలా మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎక్కువగా సెలవుల విషయంలో సమస్య వస్తుంటుంది. ఇందుకోసం..
చాలా మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎక్కువగా సెలవుల విషయంలో సమస్య వస్తుంటుంది. ఇందుకోసం కొందరు తమ బాస్ పర్మిషన్ కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అబద్ధాలు చెబితే.. మరికొందరు ఉన్నది ఉన్నట్టు చెబుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, లీవ్ విషయంలో ఉద్యోగి, బాస్‌కు జరిగిన సంభాషణకు సంబంధించిన వాట్సప్ మెసేజ్‌ల స్ర్కీన్ షాట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి, బాస్‌కు మధ్య సెలవు విషయంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్ (Whatsapp screenshot photos) ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 31న ఓ ఉద్యోగి తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు. పార్టీ మధ్యలో (Whatsapp message for leave) లీవ్ కోసం తన బాస్‌కు వాట్సాప్ మెసేజ్ చేశాడు. చాలా రోజుల తర్వాత నా స్నేహతులతో కలిసి పార్టీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉన్నాను.
అందుకే ఆఫీసుకు రాలేకపోతున్నాను. శుక్రవారం ఆఫీసుకి వస్తాను. మధ్యాహ్నం టీమ్ మెంబర్స్ అందరితో మాట్లాడతా.. అంటూ మెసేజ్ చేశాడు. ఇందుకు తన బాస్.. పార్టీ బాగా జరుగుతోందని అనిపిస్తోంది.. మమ్మల్ని కూడా తీసుకెళ్లవచ్చుగా.. అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం చూసి అవాక్కవడం ఉద్యోగి వంతవుతుంది. కాగా, ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి బాస్ అందరికీ ఉంటే ఎంత బాగుండు’’.. అంటూ కొందరు, ‘‘ఉద్యోగి ఎంతో నిజాయితీ పరుడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Jan 02 , 2024 | 07:16 PM