Viral: నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. అరగంట పాటు నిలిచిపోయిన రైలు.. తర్వాత ఏమైందంటే..
ABN, Publish Date - May 05 , 2024 | 03:45 PM
మన దేశంలో ప్రతి రోజూ ఎంతో మంది తమ ప్రయాణాల కోసం రైళ్లపై ఆధారపడతారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. అందుకోసం లక్షకు పైగా ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారు. ఎవరు కాస్త విరామం తీసుకున్నా రైలు ఆగిపోవాల్సిందే.
మన దేశంలో ప్రతి రోజూ ఎంతో మంది తమ ప్రయాణాల కోసం రైళ్లపై (Trains) ఆధారపడతారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. అందుకోసం లక్షకు పైగా ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారు. ఎవరు కాస్త విరామం తీసుకున్నా రైలు ఆగిపోవాల్సిందే. తాజాగా అలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).
పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ నెల మూడో తేదీన ఉడిమోర్ జంక్షన్‌కు వద్దకు వచ్చింది. సిగ్నల్ లేకపోవడంతో ఆ ట్రైన్‌ను లోకో పైలెట్ ఆపేశాడు. అయితే ఉడిమోర్‌లో విధులు నిర్వర్తిస్తున్న స్టేషన్ మాస్టర్‌కు (Station Master) నిద్ర ముంచుకు వచ్చింది. దీంతో ఆయన తన కుర్చీలో కూర్చుని నిద్రపోయాడు. గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపేశాడు. లోకోపైలట్ అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేదు. దాంతో రైలు పట్టాలపై అరగంటపాటు నిలిచిపోయింది. ఆ రైలులోని ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. చివరకు అతను నిద్ర లేవడంతో రైలు ముందుకు కదిలింది.
ఈ ఘటనపై ఆగ్రా రైల్వే శాఖ స్పందించింది. తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఆ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణలో స్టేషన్ మాస్టర్ నిజం అంగీకరించాడు. పాయింట్ మేన్ ట్రాక్ చెకింగ్‌కు వెళ్లాడని, ఒంటరిగా ఉన్న తాను కాస్త కునుకు తీశానని అంగీకరించాడు. దీంతో అతడిపై రైల్వే శాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: కుండ నీరు బాగా చల్లగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. వైరల్ అవుతున్న వీడియో!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2024 | 03:45 PM