ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: గడ్డకట్టే చలిలో జుట్టును నిలబెట్టిన యువతి

ABN, Publish Date - Jan 12 , 2024 | 04:21 PM

ప్రస్తుత చలికాలంలో ఉదయం వేళ బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఓ మహిళ(woman) మాత్రం ఏకంగా -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బయటకు వెళ్లింది. అలా వెళ్లిన క్రమంలో ఆమెకు ఓ వింతైన అనుభవం ఎదురైంది. ఆమె వెంట్రుకలు పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాయి.

ప్రస్తుత చలికాలంలో ఉదయం వేళ బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బయటకు వెళ్లింది. అలా వెళ్లిన క్రమంలో ఆమెకు ఓ వింతైన అనుభవం ఎదురైంది. ఆమె వెంట్రుకలు పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాయి. ఆ నేపథ్యంలో ఆమె తన వెంట్రుకలను నిలబెట్టేందుకు ప్రయత్నం చేసింది. పలు మార్లు ప్రయత్నించగా ఎట్టకేలకు వెంట్రులను నిల్చోబెట్టింది(standing her hair). అంతేకాదు ఆ క్రమంలో ఆమె చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన స్వీడన్‌లో చోటుచేసుకుంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Indian Railways: ఓహో.. రైళ్లలో టీ అందుకే వేడి నీళ్లలా ఉంటుందా? టీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..

అయితే వీడియోలో ఆమె స్వెట్టర్ ధరించి ఆ ఉష్ణోగ్రత నుంచి ఆమె కొంత ఉపశమనం పొందినట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియోను వారం రోజుల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా 10 మిలియన్ల వీక్షణలను సాధించింది. అంతేకాదు లక్షా 80 వేల మందికిపైగా లైక్ కూడా చేశారు. ఈ వీడియో చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. మీకు కచ్చితంగా జలుబు వస్తుందని ఓ వ్యక్తి కామెంట్ చేయగా..ఓ మై గాడ్, నా గుండె ఒక్కసారిగా ఆగిపోయిందని మరో వ్యక్తి అన్నారు. ఇంకో వ్యక్తి కూడా నేను కూడా ఓ సారి అలా ట్రై చేశానని అన్నారు. కానీ తర్వాత ఇంకెప్పుడూ చేయాలనుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక వైరల్ అవుతున్న క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Updated Date - Jan 12 , 2024 | 04:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising