Viral News: గుంపులో స్మార్ట్‌ఫోన్స్ మాయం.. ఈ సింపుల్ ట్రిక్‌తో వెతికిపట్టిన వ్యక్తి.. ఎలాగంటే?
ABN, Publish Date - Apr 24 , 2024 | 04:16 PM
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. కేవలం కాలక్షేపం చేయడం కోసమే కాదండోయ్.. వాటిల్లో మన వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక వివరాలూ ఉంటాయి. అందుకే.. మొబైల్ ఫోన్స్‌ని ఎంతో భద్రంగా..
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ (Smartphones) అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. కేవలం కాలక్షేపం చేయడం కోసమే కాదండోయ్.. వాటిల్లో మన వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక వివరాలూ ఉంటాయి. అందుకే.. మొబైల్ ఫోన్స్‌ని ఎంతో భద్రంగా ఉంచుకుంటారు. తమ చేతి నుంచి జారిపోకుండా, జనాల్లోకి వెళ్లినప్పుడు దొంగలకు దొరక్కుండా.. చాలా జాగ్రత్త వహిస్తారు. కానీ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు దొంగలు ఎంతో చాకచక్యంగా మొబైల్ ఫోన్‌లని కొట్టేస్తుంటారు. ఇక ఆ తర్వాత అది మన చేతికి దొరకడం దాదాపు అసాధ్యమే. కానీ.. ఈ అసాధ్యాన్ని ఓ వ్యక్తి సుసాధ్యం చేసి చూపించాడు. ఫోన్‌లు పోయిన వెంటనే కంగారుపడకుండా తనకున్న సాంకేతిక ప్రతిభను ఉపయోగించి.. దొంగలించబడ్డ తన రెండు ఫోన్లను వెతికి పట్టాడు. ఒక సింపుల్ ట్రిక్ ఆధారంగానే అతడు తన ఫోన్లను తిరిగి పొందగలిగాడు. గతేడాది తనకు ఎదురైన ఈ అనుభవాన్ని అతను ఎక్స్ మాధ్యమంగా పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ వ్యక్తి పేరు షారుఖ్ (Tech Influencer Shahrukh). ఒక టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అతను.. గతేడాది రంజాన్ సందర్భంగా తన భార్యతో కలిసి ఢిల్లీలోని జామా మసీదుకి (Jama Masjid) ఇఫ్తార్ విందుకి వెళ్లాడు. ఈ విందుకి వందలాది మంది జనం వచ్చారు. షారుఖ్ దంపతులు తమతో పాటు మూడు ఫోన్లు (ఐఫోన్ 13, షియోమీ సివి2, రెడ్‌మీ కే50 అల్ట్రా) తీసుకెళ్లారు. ఈ మూడు ఫోన్లను షారుఖ్ తన సైడ్ బ్యాగ్‌లో వేశాడు. ఈ బ్యాగ్‌లో మొత్తం రెండు చైన్ పాకెట్స్ ఉండగా.. ఒక దాంట్లో ఐఫోన్ & సివి2, మరో దాంట్లో రెడ్‌మీ కే50 అల్ట్రా ఫోన్స్ పెట్టాడు.
టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!
తమ విందు ముగించుకొని గేట్ నం.1 నుంచి బయటకు వస్తున్న క్రమంలో.. తన బ్యాగ్ తెరిచి ఉండటాన్ని షారుఖ్ గమనించాడు. అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఐఫోన్, సివి2 ఫోన్లు లేవు. దీంతో.. అవి దొంగలించబడ్డాయని గ్రహించి షారుఖ్ ‘దొంగా దొంగా, ఎవరో నా ఫోన్లను కొట్టేశారు’ అని గట్టిగా అరిచాడు. కానీ.. అంతమంది జనంలో అతని అరుపుల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అనంతరం అక్కడే ఉన్న అధికారి వద్దకు వెళ్లి తన సమస్యని షారుఖ్ వినిపించగా.. ‘‘మీలాంటి వాళ్ల కోసమే అప్రమత్తంగా ఉండమని మైక్‌లో చెప్తుంటాం, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోరు’’ అంటూ సమాధానం అవతలి నుంచి సమాధానం వచ్చింది.
Viral Video: ఆధార్ కార్డ్ కోసం పరుగు తీసిన స్టార్ క్రికెటర్
అప్పుడే షారుఖ్ తెలివిగా ఆలోచించాడు. తన వద్ద ఉన్న మరో ఫోన్ నుంచి.. తొలుత ఐఫోన్‌కి కాల్ చేశాడు. అయితే అది స్విచ్చాఫ్‌గా రావడంతో.. సివి2 ఫోన్‌కి కాల్ చేశాడు. ఆ ఫోన్ ఆన్‌లోనే ఉండటంతో.. అది రింగ్ అయ్యింది. అదేంటి.. ఐఫోన్‌ని స్విచ్చాఫ్ చేసిన దొంగ సివి2ని ఎందుకు ఆఫ్ చేయలేదు అనే అనుమానం మీకు రావొచ్చు. ఇందుకు ఓ కారణం ఉంది. సివి2 ఫోన్‌లో షట్‌డౌన్ కన్ఫర్మేషన్ అనే ఫీచర్ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరైనా ఈ ఫోన్‌ని స్విచ్చాఫ్ చేయడానికి ప్రయత్నిస్తే, అది పాస్‌వర్డ్ అడుగుతుంది. దొంగకి ఆ పాస్‌వర్డ్ తెలీదు కాబట్టి.. దాన్ని అతడు ఆఫ్ చేయలేకపోయాడు.
అప్పుడు షారుఖ్ వెంటనే ‘ఫైండ్ మై డివైజ్’ ఫీచర్ ఓపెన్ చేసి, దొంగలించబడిన ఫోన్ లొకేషన్ కనుగొనేందుకు ప్రయత్నించాడు. అది జామా మసీదు ప్రాంగణంలోనే ఉందని చూపించడంతో.. ‘ఫైండ్ మై డివైజ్’లో మిస్ అయిన మొబైల్ సెలక్ట్ చేసి, ట్యాప్ సౌండ్ క్లిక్ చేశాడు. దాంతో ఆ ఫోన్ మోగడం స్టార్ట్ అయ్యింది. దాన్ని సైలెంట్ చేయాలన్నా.. అవతలి వ్యక్తికి కుదరదు. అయితే.. అంతమందిలో దొంగని గుర్తించడం కష్టమవ్వడంతో, షారుఖ్ కాల్ చేశాడు. ఎన్నోసార్లు కాల్ చేశాడు కానీ, అవతలి వ్యక్తి ఎత్తలేదు. చివరికి అతడు కాల్ లిఫ్ట్ చేసి, గేమ్ నం.2 వద్దకు వచ్చి ఫోన్లు తీసుకోవాల్సిందిగా చెప్పాడు.
Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..
ఆ వ్యక్తి పేరు సౌరవ్ శ్రీవాస్తవ్ అని చెప్పిన షారుఖ్.. అతని వద్దకు వెళ్లగానే తన రెండు ఫోన్లు తనకు వెనక్కు తిరిగి ఇచ్చాడని తెలిపాడు. ఎక్కడో మైదానంలో పడి ఉంటే ఈ రెండు ఫోన్లను తాను తీసుకున్నానని సౌరవ్ తనకు చెప్పాడని.. ఏదేమైనా తన ఫోన్లు తిరిగి దొరకడంతో ఆ వ్యక్తికి థాంక్స్ చెప్పానని అన్నాడు. అదృష్టవశాత్తూ దొంగలు తమ ఫోన్లలోని సిమ్ కార్డులు బయటకు తీయలేదని చెప్పాడు. తాను ప్రశాంతంగా ఆలోచించి, ఫైండ్ మై డివైజ్ ట్రిక్‌తో.. కోల్పోయిన తన ఫోన్లను తిరిగి పొందగలిగానని షారుఖ్ చెప్పుకొచ్చాడు.
Read Latest Prathyekam News and Telugu News
Updated Date - Apr 24 , 2024 | 04:19 PM