Puzzle: మీ పరిశీలనా శక్తికి అసలైన పరీక్ష.. ఈ ప్లే గ్రౌండ్‌లో టీపాట్ ఎక్కడుందో కనిపెట్టండి!
ABN, Publish Date - May 05 , 2024 | 11:45 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ప్లే గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలతో పాటు ఎన్నో ఆట వస్తువులు ఆ ఫొటోలో ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఒక టీ పాట్ కూడా ఉంది. ఆ టీ పాట్ ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ టీపాట్ ఎక్కడుందో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ టీపాట్ ఎక్కడుందో తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2024 | 11:45 AM