ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thailand: 300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే..!

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:46 PM

ఒకటి కాదు రెండు కాదు.. 300 లగ్జరీ కార్లు, 38 ఎయిర్‌క్రాఫ్ట్స్, 50కి పైగా విలాసవంతమైన షిప్‌లు, వజ్ర వైడూర్యాలు, బంగారు సింహాసనాలతో ఔరా! అనిపిస్తున్నారు. ఆయనెవరో కాదు.. థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్.

Thailand King Maha Vajiralongkorn

థాయ్‌లాండ్: ఆయనేమీ అదానీ కాదు.. అంబానీ అంత రిచ్ పర్సన్ కానే కాదు.. కానీ, వారిని మించిన రాయల్‌ లైఫ్‌ను అనుభవిస్తున్నాడు. కోటాను కోట్ల ఆస్తికి అధిపతిగా రిచ్‌ లైఫ్‌ను ఆస్వాధీస్తూ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. 300 లగ్జరీ కార్లు, 38 ఎయిర్‌క్రాఫ్ట్స్, 50కి పైగా విలాసవంతమైన షిప్‌లు, వజ్ర వైడూర్యాలు, బంగారు సింహాసనాలతో ఔరా! అనిపిస్తున్నారు. ఆయనెవరో కాదు.. థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్. ఈయనను థాయ్‌లాండ్ రాజు రామా ఎక్స్ అని కూడా పిలుస్తారు.

ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. అరుదైన వజ్రాలు, రత్నాలు సేకరణ అంటే ఈయనకు చాలా ఇష్టం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీరదైన వజ్రవైఢూర్యాలను కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇక థాయ్‌లాండ్‌లో వేల ఎకరాల భూమి ఆయన సొంతం. అధికారిక నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్ రాజకుటుంబ సంపద 40 బిలియన్ డాలర్లు. అంటే 3.2 లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉందన్నమాట.

కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్ ఆస్తి థాయిలాండ్ అంతటా విస్తరించి ఉంది. థాయ్‌లాండ్‌లో 6,560 హెక్టార్ల (16,210 ఎకరాలు) భూమి ఉంది. ఆయనకు సంబంధించిన భూమిలో అగ్రిమెంట్స్‌తో మాల్స్, హోటళ్లతో సహా అనేక ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరిగింది. నివేదికల ప్రకారం.. కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్ థాయ్‌లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంక్ సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే, దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం సియామ్ సిమెంట్ గ్రూప్‌లో 33.3 శాతం వాటాను కలిగి ఉన్నారు.

థాయిలాండ్ రాజు కిరీటంలో మరొక విలువైన రత్నం 545.67-క్యారెట్ బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన వజ్రంగా పరిగణించబడుతుంది. దీని విలువ రూ.98 కోట్ల వరకు ఉంటుందని డైమండ్ అథారిటీ అంచనా వేసింది.

థాయ్ కింగ్ వద్ద బోయింగ్, ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్, సుఖోయ్ సూపర్‌జెట్‌, 21 హెలికాప్టర్‌లతో సహా 38 విమానాలను ఉన్నాయి. ఈ విమానాల నిర్వహణకు ఆయన ఏటా రూ.524 కోట్లు వెచ్చిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అతని విలాసవంతమైన కార్ల విషయానికి వస్తే.. లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్‌తో సహా 300 కంటే ఎక్కువ ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే, దాదాపు 52 షిప్‌లు, రాయల్ బోట్‌లు కూడా ఉన్నాయి. అన్ని షిప్‌లపై గోల్డ్ కోటింగ్ ఉంటుంది.

ఇక 1782లో నిర్మించిన కింగ్ ప్యాలెస్ 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అయితే, వజిరాలాంగ్‌కార్న్ ప్రస్తుతం రాజభవనంలో నివసించడం లేదు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొత్తంగా భారీస్థాయిలో ఆస్తులు కలిగి.. ప్రపంచంలోనే ఏ ధనవంతుడు కూడా జీవించని విధంగా విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు థాయ్ కింగ్ వజిరాలాంగ్‌కార్న్.

Updated Date - Jan 04 , 2024 | 01:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising