ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

June Month: జూన్ నెలలో ఈ తేదీలు ఎంతో ముఖ్యమైనవి.. అవేంటంటే?

ABN, Publish Date - May 29 , 2024 | 04:00 PM

ఈ ఏడాదిలోని మే నెల దాదాపు ముగింపు దశకు చేరుకుంది. రెండు రోజుల తర్వాత జూన్ నెల ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈ జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. 1వ తేదీ నుంచే..

ఈ ఏడాదిలోని మే నెల దాదాపు ముగింపు దశకు చేరుకుంది. రెండు రోజుల తర్వాత జూన్ నెల ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈ జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. 1వ తేదీ నుంచే ఈ నెల ఎగ్జిట్ పోల్స్‌తో (Exit Polls) ఎగ్జైటింగ్‌గా ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి ఎన్నికల కౌంటింగ్, కల్కి సినిమా (Kalki Movie) రిలీజ్ దాకా.. ఇలా ఎన్నో ఈవెంట్‌లు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా రానున్నాయి. ఇంతకీ ఏయే తేదీల్లో ఆ ఈవెంట్స్ రాబోతున్నాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జూన్ 1 - ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఆ రోజున సార్వత్రిక ఎన్నికల చివరి (ఏడో) దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి. ఈ రిజల్ట్ నిజమైనవని కావు కానీ.. ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయం మాత్రం ఈ ఫలితాలతో దాదాపు తేలిపోతుంది.

జూన్ 1 - ఇండియా vs బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్: భారత కాలమాన ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే.. అంతకుముందు రోజు బంగ్లాదేశ్‌, భారత్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత ఆటగాళ్లు అమెరికాకు వెళ్లి, అక్కడ కసరత్తులు ప్రారంభించారు.


జూన్ 2 - టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం: ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టీ20 వరల్డ్‌కప్ సమరం జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలు కానున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనడం కోసం చాలా జట్లు ఆ దేశానికి పయనమయ్యాయి.

జూన్ 4 - సార్వత్రిక ఎన్నికల ఫలితాలు: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీల్లో ఈ ఎన్నికలు సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను జూన్ 4న కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించనుంది.

జూన్ 5 - ఇండియా vs ఐర్లాండ్ మ్యాచ్: ఈ మ్యాచ్‌తోనే టీ20 వరల్డ్‌కప్‌లో భారత ప్రయాణం ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పసికూనే అయినప్పటికీ.. వరల్డ్‌దాకా చేరిందంటే దాన్ని అంత తక్కువ అంచనా వేయలేం. గతంలో పెద్ద జట్లను ఓడించిన చరిత్ర ఆ జట్టు సొంతం. మరి, వీరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి.

జూన్ 9 - ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: దీన్ని ఒక మ్యాచ్ అని చెప్పడం కన్నా.. ఓ సంబరమని పేర్కొనవచ్చు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే.. దాన్నొక వేడుకలా చూస్తారు. ఐసీసీ టోర్నీలో పాక్‌పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఒక్క ఓటమి మినహాయిస్తే.. మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్‌దే పై చేయి.


జూన్ 12 - ఇండియా vs యూఎస్ఏ మ్యాచ్: ఈ టీ20 మెగా టోర్నీలో యూఎస్ఏతో భారత్ తలపడటం ఇదే మొదటిసారి. అదొక పసికూన కాబట్టి.. భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందని అంచనా వేయొచ్చు.

జూన్ 15 - ఇండియా vs కెనడా మ్యాచ్: లీగ్ దశలో భాగంగా ఆ ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. కెనడాకు కూడా పెద్దగా ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు పసిగట్టేయొచ్చు.

జూన్ 17 - కల్కి సినిమా: ఒక్క తెలుగు ఆడియెన్సే కాదు.. యావత్ ప్రపంచం ఈ సినిమా కోసం వేచి చూస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో, పురాణాల ఆధారంగా ఈ కల్కి రూపొందుతోంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాభ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 29 , 2024 | 04:04 PM

Advertising
Advertising