ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mbaru Niang : ఇండోనేషియాలో మాత్రమే కనిపించే ఈ ఇల్లు గురించి తెలుసా..!

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:22 PM

15 మీటర్ల ఎత్తులో 5 అంతస్తులుగా ఈ ఇంటి నిర్మిస్తారు. మబారు నియాంగ్ (Mbaru Niang) సాంప్రదాయ ఇల్లు చాలా అరుదు ఎందుకంటే ఇది కేవలం కొద్దిమంది మాత్రమే నివసించేది.

highest village

ఈ సాంప్రదాయ ఇల్లు ప్రత్యేకంగా కోన్ ఆకారంలో నిర్మించినదై ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించే ఈ కోన్ హౌస్ నిర్మాణం గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకుందాం. 15 మీటర్ల ఎత్తులో 5 అంతస్తులుగా ఈ ఇంటి నిర్మిస్తారు. మబారు నియాంగ్ (Mbaru Niang) సాంప్రదాయ ఇల్లు చాలా అరుదు ఎందుకంటే ఇది కేవలం కొద్దిమంది మాత్రమే నివసించేది.

ఐదు అంతస్తులుగా నిర్మించే ఈ ఇంటిలో ఒక్కో అంతస్తునూ ఒక్కో అవసరానికి ప్రత్యేకంగా వాడతారు. మొదటి అంతస్తులో వంట, రెండూ మూడులో పడక, నాలుగు, ఐదు అంతస్తుల్లో ఆ ఏడాదికి దాచుకునే ధాన్యం నిల్వలను ఇక్కడ దాచిపెడతారు. ఈ పర్వతాలోల ఒంటరిగా ఉన్న వేరెబో అనే మారుమూల గ్రామంలో మాత్రమే ఈ ఇళ్ళు కనిపిస్తాయి. ఈ ఇంటి పైకప్పును పైబర్ తో తయారు చేస్తారు. ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా చెక్కతో స్తంబానికి మధ్య కేంద్రంగా నిర్మాణం జరుగుతుంది. మొదటి అంతస్తులోని ఒక గదిలో బల్క్ హెడ్ లో ప్రైవేట్ గదిగా విభజిస్తారు.

వెస్ట్ మంగ్‌గరై, NTTలోని వే రెబో ఒక గ్రామం అయినప్పటికీ, వారు పశ్చిమ సుమత్రా నుండి మినాంగ్ సంతతికి చెందిన వారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఎంపో మారో, మినంగ్‌కబౌకు చెందిన వే రెబో పూర్వీకులు ఫ్లోర్స్‌కు వలస వెళ్లి, స్థలం నుండి మరొక ప్రాంతానికి మారారు, చివరకు ఇప్పుడు వే రెబో విలేజ్‌గా ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. కోన్-ఆకారపు ఇంటి పైన ఇండోనేషియా జెండాను ఏర్పాటు చేస్తారు. జెండా స్థిరంగా ఉందని నిర్ధారించుకోవడానికి చాలా మంది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంటి పైకి ఎక్కుతారు.

ఇండోనేషియాలోని ఎతైన గ్రామాల జాబితాలో వే రోబో గ్రామం కూడా ఒకటి.

సముద్రమట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉన్న వే రెబో తరచుగా ప్రతి ఉదయం పొగమంచు కప్పేస్తూ ఉంటుంది. వే రెబో విలేజ్ లోని సాంప్రదాయ ఇల్లులు మాత్రం కోన్ బార్న్ లాగా ఉండి ఈ పొగమంచులో కూడా అందంగా కనపిస్తాయి. ఒక్కో ఇంట్లో ఆరు నుంచి ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. Mbaru Niang తాటి ఆకుల పైకప్పులతో ఐదు అంతస్తులను కలిగి ఉంటుంది.


ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!

ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!

వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

ఈ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం నవంబర్లో గ్రామంలోని నివాసితులంతా కలిసి సాంప్రదాయ వేడుకలు జరుపుకుంటారు. నివాసితులు ఉపకరణాలతో కూడిన సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. Mbaru niang సాంప్రదాయ ఇల్లు చాలా అరుదు. ఎందుకంటే అక్కడ కొన్ని మాత్రమే ఇలాంటి సాంప్రదాయ ఇళ్ళు ఉన్నాయి. పర్వతాలలో ఒంటరిగా ఉన్న వే రెబో అనే సాంప్రదాయ గ్రామంలో మాత్రమే కనిపిస్తాయి. ఈ గ్రామం Mbaru Niang పరిరక్షణ ప్రయత్నం UNESCO ఆసియా-పసిఫిక్ 2012 నుండి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అత్యున్నత వర్గం అవార్డు పొందింది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 12:26 PM

Advertising
Advertising