Birds Sing At Night: ఈ పక్షులు రాత్రిపూట పాటలు పాడుకుంటాయ్..!
ABN, Publish Date - Feb 16 , 2024 | 10:58 AM
హెరాన్లు ప్రతి ఖండంలో నివసిస్తాయి. కాని అంటార్కిటికా, చిత్తడి నేలల్లో నీటి వనరుల దగ్గర చిన్న జలచరాలను వేటాడతాయి.
గుడ్లగూబలు అర్థరాత్రి పూట కూస్తాయి. కానీ చంద్రకాంతిలో పాటలు పాడే పక్షులు ఇంకా చాలా ఉన్నాయి. నైటింగేల్స్, మోకింగ్ బర్డ్స్, కార్న్ క్రేక్ లు, పోటూలు, విప్ పూర్ విల్ ఇలా చాలావరకూ పక్షలు రాత్రి సమయాల్లో కూతలు కాస్తాయి. చక్కగా పాడతాయి. మరి వీటిగురించి తెలుసుకుందాం.
ప్రకృతిలో చికటి సమయాల్లో
ఉత్తర మోకింగ్ బర్డ్..
రాత్రి సమయాల్లో మాకింగ్ బర్డ్స్ బ్లోన్ బ్లోస్ లాగా వినిపిస్తుంది. ఇవి 200 రకాలుగా పాటలు పాడతాయి. ఈ పక్షల్లో ఆడా మగ పక్షులు రెండూ పాడతాయి. ముఖ్యంగా పౌర్ణమి సమయంలో రోజులో 24 గంటలూ పాడతాయి. ఇవి సిగ్గుపడవు, బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పొడవాటి తోకను కదుపుతూ సులభంగా పాడుతూ ఉంటాయి.
నైటింగేల్..
చక్కని పాట విన్న ఎవరైనా టక్కున చెప్పే పోలిక నైటింగేల్ లా పాడావనే.. ఈ నైటింగేల్ పాటలో మధురమైన కంఠాన్ని కలిగి ఉంటుంది. పాటలు వేణువులాగా ఉంటాయి. ఇందులో బలమైన జానపద గీతాలు మిళితం చేయబడ్డాయి. ఈ జాతులు ఎప్రిల్, జూలై మధ్య ఉత్తర ఆఫ్రికా, యూరప్, మధ్య ఆసిలో సంతానోత్పత్తి చేస్తాయి. శీతాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు వలసపోతాయి.
తూర్పు విప్ పూర్ విల్..
అడవిలో రాత్రి సమయాల్లో కూసే పక్షి. వసంత బుతువు, వేసవికాలంలో విప్ పూర్ విల్స్ ఆకురాల్చే మిశ్రమ అడవులలో సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి ఎండిన కొమ్మలపై కొమ్మ ఆకారంలో నిలబడి ఆ రంగులో కలిసిపోయి వేటాడతాయి. వెన్నెల రాత్రులలో కీటకాలను తింటాయి.
గ్రేట్ పోటూ..
ఆగ్నేయ మెక్సికో బొలీమియా వరకు ఉన్న ఉష్ణమండల అడవులలో, కనిపించే ఈ పక్షి రాత్రి నిశ్చలంగా కూస్తాయి. కీటకాలు తినే ఏటు పోటూ జాతులున్నాయి. ఈ పక్షలు పగటిపూట చెట్లలో దాక్కుంటాయి. వెన్నెల రాత్రుల్లో గానం చేస్తాయి.
ఇది కూడా చదవండి: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !
యూరోపియన్ రాబిన్..
యూరోపిన్ రాబిన్ లు ఏడాది పొడవునా పాడుతుంది. అవి సహజంగా రాత్రిపూట ఉండవు. సంధ్యా సమయానికి బాగా అలవాటు పడతాయి. తెల్లవారుజామున పాడే మొదటి పక్షులు కూడా ఇవే..సంవత్సరంలో ఇతర సమయాల్లో, వసంత ఋతువులో సంతానోత్పత్తి ప్రదేశాలకు, వలస పక్షుల మధ్య రాత్రిపూట పక్షుల సందడి చేస్తాయి. అనేక జాతులు రాత్రిపూట వలసపోతాయి. దోపిడీ జాతుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, వాటి మందలోని ఇతర పక్షులతో సంబంధాన్ని కొనసాగించడానికి పాట పాడతాయి.
గ్రేట్ రీడ్ వార్బ్లెర్..
సంతానోత్పత్తి కాలంలో రాత్రి సమయాల్లో పాడతాయి. ఈ చిన్న పక్షలు కీటకాలను తింటాయి. పశ్చిమ ఐరోపా, తూర్పు హావాయి, కిరిబాటి వరకూ నివసిస్తాయి.
బ్లాక్ కిరీటం నైట్ హెరాన్..
హెరాన్లు ప్రతి ఖండంలో నివసిస్తాయి. కాని అంటార్కిటికా, చిత్తడి నేలల్లో నీటి వనరుల దగ్గర చిన్న జలచరాలను వేటాడతాయి. ప్రపంచం వ్యాప్తంగా 65 జాతులున్నాయి. సూర్యాస్తమయం తర్వాత పాడతాయి.
Updated Date - Feb 16 , 2024 | 10:58 AM