Viral Video: అలా కనిపిస్తున్నారు కానీ, వీళ్లు మామూలు దొంగలు కారు.. వీరి మోసం ఏ రేంజ్‌లో ఉంటుందంటే..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:22 PM
కుటుంబ సభ్యులందరూ కలిసి సరాదాగా ఏదో రెస్టారెంట్‌కు వెళ్తారు.. ఒక టేబుల్ దగ్గర కూర్చుని తమకు కావాల్సినవన్నీ తింటారు.. అనంతరం బిల్లు కట్టే సమయంలో చిన్న ట్రిక్ ప్లే చేసి రెస్టారెంట్ నుంచి మెల్లిగా జారుకుంటారు.. ఇలా పలు రెస్టారెంట్‌లను వీరు మోసం చేశారు..
కుటుంబ సభ్యులందరూ కలిసి సరాదాగా ఏదో రెస్టారెంట్ (Restaurant)కు వెళ్తారు.. ఒక టేబుల్ దగ్గర కూర్చుని తమకు కావాల్సినవన్నీ తింటారు.. అనంతరం బిల్లు కట్టే సమయంలో చిన్న ట్రిక్ ప్లే చేసి రెస్టారెంట్ నుంచి మెల్లిగా జారుకుంటారు.. ఇలా పలు రెస్టారెంట్‌లను వీరు మోసం చేశారు.. వీరి దెబ్బకు ఐదు రెస్టారెంట్లు లక్ష రూపాయలకు పైగానే నష్టపోయాయి (Cheating). అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
బ్రిటన్ (Britain)లోని శాన్‌ఫీల్డ్స్‌కు చెందిన ఆన్ మెక్‌డొనాగ్, ఆమె భర్త బెర్నార్డ్ మెక్‌డొనాగ్ ఐదు రెస్టారెంట్లలో భోజనం చేసి, బిల్లు చెల్లించకుండా పారిపోయారు. ఇటీవల వీరు మరో నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి బెల్లా సియావో అనే సిసిలియన్ రెస్టారెంట్‌లో తిని 329 పౌండ్ల (సుమారు రూ. 34,000) బిల్లు చెల్లించకుండా పారిపోయారు. వెంటనే ఆ రెస్టారెంట్ యజమాని సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు వారు మరో నాలుగు రెస్టారెంట్లలో కూడా అలాగే చేసినట్టు విచారణలో తేలింది.
మొత్తం నలుగురు పెద్దవాళ్ల, ఇద్దరు పిల్లలు కలిసి రెస్టారెంట్‌కు వెళతారు. తమకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసి తింటారు. భోజనం అనంతరం బిల్లు తీసుకుని పెద్దవాళ్లు రెస్ట్ రూమ్‌కు అని చెప్పి బయటకు వెళతారు. పిల్లలు లోపలే ఉన్నారు కాబట్టి సిబ్బందికి అనుమానం రాదు. కొద్ది సేపటి తర్వాత ఆ చిన్న పిల్లలు కూడా మెల్లిగా బయటపడతారు. ఇదే ట్రిక్‌తో మెక్ డొనాగ్ కుటుంబం ఐదు రెస్టారెంట్‌లలో మోసానికి పాల్పడి చివరకు పోలీసులకు దొరికిపోయారు. వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 30 , 2024 | 04:43 PM