Viral: టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? సముద్రంలో మునిగిపోవడానికి ముందు అందులోని వారు ఏం తిన్నారంటే..
ABN, Publish Date - Apr 09 , 2024 | 03:49 PM
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయి 112 ఏళ్లు గడిచిపోయింది. అయినప్పటికీ ఈ భారీ ఓడకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా చర్చనీయాంశంగా మారుతోంది. 1912 ఏప్రిల్ 15వ తేదీన అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మునిగిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టైటానిక్ (Titanic) ఓడ సముద్రంలో మునిగిపోయి 112 ఏళ్లు గడిచిపోయింది. అయినప్పటికీ ఈ భారీ ఓడకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా చర్చనీయాంశంగా మారుతోంది. 1912 ఏప్రిల్ 15వ తేదీన అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మునిగిపోయింది (Titanic Sank). ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది మరణించారు. ఈ ఓడ మునిగిపోవడానికి ముందు రోజు రాత్రి ప్రయాణికులకు అందించిన ఆహారానికి సంబంధించిన మెనూ కార్డ్ (Titanic Menu Card) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).
Fascinating అనే ట్విటర్ యూజర్ ఈ పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో 112 ఏళ్ల క్రితం నాటి టైటానిక్ ఫుడ్ మెనూ కార్డ్ ఉంది. టైటానిక్‌లో ప్రయాణిస్తున్న మొదటి, మూడో తరగతి ప్రయాణీకుల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను ఆ మెనూ కార్డ్‌లో చూడవచ్చు. టైటానిక్ ఫుడ్ మెనూను చాలా ఏళ్ల క్రితం బ్రిటన్‌లో వేలం వేస్తే రూ. 84 లక్షల ధర పలికింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెనూ కార్డ్‌లో చికెన్, కార్న్డ్ బీఫ్, కూరగాయలు, పకోడాలు ఉన్నాయి. అలాగే గ్రిల్డ్ మటన్, హామ్ పై, సాసేజ్ చీజ్, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మొదటి తరగతి ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇక, మూడో తరగతి ప్రయాణికులకు గంజి, పాలు, బంగాళదుంపలు, హామ్, గుడ్లు, బ్రెడ్, వెన్న, జామ్, టీ, కాఫీ వంటి జాబితా ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 10.2 లక్షల మందికి పైగా వీక్షించారు. 8 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మూడో తరగతి ప్రయాణికులకు మసాలా పదార్థాలు అందుబాటలో లేవు``, ``మూడో తరగతి వారికి పగటి పూట గంజి మాత్రమే ఇచ్చారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Opitcal Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలోని కుక్కను 10 సెకెన్లలో కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 09 , 2024 | 03:49 PM