Optical illusion: ఈ గదిలో ఆపిల్ పండు ఎక్కడుందో కనుక్కుంటే.. మీ చూపు పదునుగా ఉన్నట్లే..
ABN, Publish Date - Jan 27 , 2024 | 02:50 PM
కంటి చూపునకు పరీక్ష పెట్టడంతో పాటూ మేథోశక్తిని పెంపొందించే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఫొటో ఫజిళ్లను పరిష్కరించడం పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయితే...
కంటి చూపునకు పరీక్ష పెట్టడంతో పాటూ మేథోశక్తిని పెంపొందించే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఫొటో పజిళ్లను పరిష్కరించడం పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయితే చివరకు సమాధానం తెలియగానే.. అరే ఇంత ఈజీనా... అని అనిపిస్తుంది. ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గదిలో వివిధ రకాలు వస్తువులు ఉన్నాయి. అయితే వాటి మధ్యలో ఓ గ్రీన్ ఆపిల్ పండు కూడా ఉంది. అదెక్కడుందో కనుక్కోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్ (Optical illusion) ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ గదిలో కుర్చీలు, టేబుళ్లు, వివిధ రకాల బొమ్మలో పాటూ అనేక రకాల వస్తువులు ఉన్నాయి. అయితే వాటి మధ్యలో ఓ గ్రీన్ ఆపిల్ పండు (Green apple fruit) కూడా ఉంది. అయితే దాన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప కనుక్కోవడం అసాధ్యం.
Viral Video: ఇది బైకు లాంటి సైకిల్.. ఈ పెద్దాయన తెలివితేటలు చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..
ఈ ఫొటో చూసిన వారంతా.. ఆపిల్ పండును కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా చాలా మందికి అది కష్టసాధ్యంగా మారుతోంది. ఫొటో చూసిన వారంతా.. ఆపిల్ అండు అదిగో అక్కడుంది, ఇదిగో ఇక్కడుంది.. అంటూ ఫొటో మీద మార్క్ చేసి కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ సారి ప్రయత్నిచండి. మీరు దాన్ని గుర్తిస్తే మీ చూపు చాలా పదునుగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆపిల్ పండును గుర్తించడం మీకు కష్టంగా మారితే.. సమాధానం కోసం ఈ క్రింద ఉన్న ఫొటో చూస్తే తెలిసిపోతుంది.
Puzzle Photo: ఈ రెండు ఫొటోల్లో ఐదు తేడాలున్నాయి.. పది సెకన్లలో కనిపెడితే మీరే తోపు..
Updated Date - Jan 27 , 2024 | 03:33 PM