ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Puzzle Photo: ఈ రెండు ఫొటోల్లో ఐదు తేడాలున్నాయి.. పది సెకన్లలో కనిపెడితే మీరే తోపు..

ABN, Publish Date - Jan 26 , 2024 | 08:42 PM

మేథా శక్తిని పెంపొందించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇలాంటి వాటిలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫజిల్స్‌ను...

మేథా శక్తిని పెంపొందించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇలాంటి వాటిలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. వీరి అభిరుచికి తగినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అనేక ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఫజిల్ ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ ఉన్న రెండు ఫొటోల్లో మొత్తం ఐదు తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను పది సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు..

సోషల్ మీడియాలో ఫజిల్ ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ హోటల్లో కొందరు భోజనం చేస్తుంటారు. అలాగే మరోవైపు వెయిటర్ వద్దకు ఓ పిల్లి వచ్చి ఆర్డర్ చేస్తుంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన రెండు ఫొటోల్లో మొత్తం ఐదు తేడాలు ఉన్నాయి. ఒక ఫొటోలో ఉన్న వస్తువులు, ఇంకో ఫొటోలో కనిపించవు. కానీ వాటిని గుర్తుపట్టడం అంత సులభం ఏమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే ఎంతో ఈజీగా చెప్పేయొచ్చు. ఆ ఐదు తేడాలను వెంటనే గుర్తించారంటే మీది పవర్‌ఫుల్ చూపు అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం గుర్తుపట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కష్టం ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటోలను గమనిస్తే.. ఆ తేడాలు ఏంటో తెలిసిపోతుంది.


పై ఫొటోల్లో ఒకదాంట్లో వెయిటర్ పక్కన టేబుల్‌పై బోర్లించిన శంఖాకార వస్తువుపై మిరియాలు, ఉప్పు ఉన్నాయి. అయితే రెండో ఫొటోలో అవి లేవు.

ఇక్కడ మొదటి ఫొటోలో భోజనం చేస్తున్న వారి టేబుల్‌పై చివరన జ్యూస్ గ్లాసు ఉంది. రెండో ఫొటోలో అది లేదు.

పైన ఉన్న మొదటి ఫొటోలో పిల్లి పక్కన ఉన్న కుర్చీకి చేయి ఉంది. అయితే రెండో ఫొటోలో అది కనపడదు.

ఇక్కడ ఉన్న పిల్లి తలపై ఓ మనిషి కూర్చున్నట్లు తల కనిపిస్తోంది కదా.. అది రెండో ఫొటోలో మిస్ అయింది.

ఇక ఐదవ తేడా ఏంటంటే.. పిల్లి వేసుకున్న షర్ట్‌కు ఒక ఫొటోలో 5 గుండీలు ఉన్నాయి. రెండో ఫొటోలో ఒక గుండీ తక్కువ ఉంది.

Updated Date - Jan 26 , 2024 | 08:42 PM

Advertising
Advertising