మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wife: ఎవరైనా ఇలా చేస్తారా.. పది రోజులుగా భర్త స్నానం చేయలేదని.. ఈ భార్య చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Feb 04 , 2024 | 09:40 PM

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు తలెత్తుతుంటాయి. భర్త తాగుతున్నాడని కొందరు, అనుమానిస్తు్న్నాడని మరికొందరు, చీటికీ మాటికీ చిత్రహింసలు పెడుతున్నాడని ఇంకొందరు భార్యలు.. చివరకు..

Wife: ఎవరైనా ఇలా చేస్తారా.. పది రోజులుగా భర్త స్నానం చేయలేదని.. ఈ భార్య చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు తలెత్తుతుంటాయి. భర్త తాగుతున్నాడని కొందరు, అనుమానిస్తు్న్నాడని మరికొందరు, చీటికీ మాటికీ చిత్రహింసలు పెడుతున్నాడని ఇంకొందరు భార్యలు.. చివరకు తెగించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు విడాకులు తీసుకునేందుకూ వెనుకాడరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. భర్త పది రోజులుగా స్నానం చేయలేదని చివరకు ఆమె చేసిన పనేంటంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. టర్కీలోని (Turkey) అంకారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళకు భర్త నుంచి వింత సమస్య వచ్చి పడింది. కొన్ని నెలల వరకూ సక్రమంగా ఉన్న భర్త ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. సక్రమంగా స్నానం చేయకపోవడం, పళ్లు తోయకపోవడమే భార్యకు సమస్య తెచ్చిపెట్టింది. ఇటీవల అతను ఏకంగా పది రోజుల వరకూ స్నానం చేయకపోవడంతో పాటూ ఐదు రోజుల పాటు బ్రష్ కూడా చేయకుండా ఉన్నాడు. అలాగే ఐదు రోజుల పాటూ ఒకే దుస్తులు ధరించడం కూడా భార్యకు చిరాకు తెప్పించింది.

Watch video: ఈ పులి నటన మామూలుగా లేదుగా.. దాహం వేసినట్లు నటిస్తూనే.. ఎలా మోసం చేసిందంటే..

చివరకు భర్త వద్ద తీవ్రమైన చెమట వాసన వస్తుండడతో ఆమె భరించలేకపోయింది. ఎంత చెప్పినా అతడిలో మార్పు రాకపోవడంతో చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్త నుంచి విడాకులు (Divorce) కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు.. భార్య వాదనతో ఏకీభవించింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా భార్యకు ఇబ్బందిగా మారడాన్ని నేరంగా పరిగణించింది. సదరు మహిళకు విడాకులు మంజూరు చేయడమే కాకుండా.. భార్యకు పరిహారంగా రూ.13.68లక్షలు చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మీరు రోజూ వాడే ఈ 10 వస్తువులు.. మరుగుదొడ్డి కంటే ఘోరమని తెలుసా..?

Updated Date - Feb 04 , 2024 | 09:40 PM

Advertising
Advertising