Viral News: రెండు కుక్కల అరెస్ట్.. అవి చేసిన నేరం తెలిస్తే షాక్..!
ABN, Publish Date - Jan 06 , 2024 | 06:22 PM
హ్యూస్టన్‌కు చెందిన ఓ డీలర్‌షిప్ షోరూమ్‌లో 350,000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 2,91,16,972) నష్టం కలిగించిన రెండు వీధి కుక్కలను అరెస్ట్(బంధించారు) చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
Viral News: హ్యూస్టన్‌కు చెందిన ఓ డీలర్‌షిప్ షోరూమ్‌లో 350,000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 2,91,16,972) నష్టం కలిగించిన రెండు వీధి కుక్కలను అరెస్ట్(బంధించారు) చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. టెక్సాస్‌లోని హారిస్ కౌంటీలో జి మోటార్స్ లాట్ ఉంది. ఇందులో గతేడాది డిసెంబర్ రెండు వీధి కుక్కలు హల్ చల్ చేశాయి. ఈ లాట్‌లోని కార్లను ధ్వంసం చేశాయి. లాట్ మొత్తం కలియతిరుగుతూ.. కార్లపైనుంచి దూకడం, పెయింగ్‌ను గీయడం, నోటితో కారు బంపర్‌లను తీల్చడం చేశాయి. ఈ దృశ్యాలన్నీ కంపెనీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు.
డీలర్‌షిప్ ఫైనాన్స్ మేనేజర్ ఇమ్రాన్ హక్, సేల్స్ మేనేజర్ గాబీ ఫఖౌరీ ఆ కుక్కను బంధించేందుకు సహాయం కోసం హ్యూస్టన్ జంతు నియంత్రణ ఏజెన్సీ BARCని సంప్రదించారు. బోన్లు, పిల్లిని ఎరగ వేసి ఆ కుక్కలను ట్రాప్ చేశారు. తొలత బ్రౌన్ పిట్‌బుల్‌ను పట్టుబడగా.. ఆ తరువాత మరో నల్లని కుక్క పట్టుబడింది. నవంబర్ డిసెంబర్ మధ్య ఈ కుక్కలు కనీసం నాలుగుసార్లు లాట్‌లో విధ్వంసం సృష్టించాయని డీలర్‌షిప్ నిర్వాహకులు చెప్పారు. దాదాపు 5 లగ్జరీ కార్లను ధ్వసం చేశాయని తెలిపారు. అయితే, మొదట ఈ విధ్వంసానికి కారణం తోడేలు అనుకున్నామని, కానీ, సీసీ ఫుటేజీలో వీధి కుక్కలను చూసి షాక్ అయ్యామని చెప్పారు.
పిల్లిని వెంబడిస్తున్నప్పుడు కుక్కలు కంచెలోని రంధ్రం గుండా ప్రవేశించి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. కాగా, ఇవి సృష్టించిన విధ్వంసం కస్టమర్లు, ఉద్యోగుల్లో భయాన్ని కలిగించిందన్నారు. కానీ, ఇప్పుడు ఆ రెండు కుక్కలు అదుపులో ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - Jan 06 , 2024 | 07:01 PM