ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇది ఐపీఎల్ టిక్కెట్టా? పెళ్లి శుభలేఖా?.. ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ABN, Publish Date - Apr 19 , 2024 | 03:48 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ప్రత్యేకమైనది. అందుకే పెళ్లికి సంబంధించి ప్రతీది స్పెషల్‌గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి కార్డును ప్రత్యేకంగా డిజైన్ చేయించింది.

వెడ్డింగ్ ఇన్విటేషన్

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ప్రత్యేకమైనది. అందుకే పెళ్లికి సంబంధించి ప్రతీది స్పెషల్‌గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి కార్డును (Wedding Card) ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను (CSK) అమితంగా ఇష్టపడే ఆ జంట సీఎస్కే లోగో, రంగులను ఉపయోగించి వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


ఆ శుభలేఖలో సీఎస్కే లోగోతో పాటు వధూవరుల ఫొటోలు కూడా ఉన్నాయి. అంతేకాదు వివాహ ఆహ్వానంలో ``మ్యాచ్ ప్రివ్యూ``, ``మ్యాచ్ ప్రిడిక్షన్`` వంటి క్రికెట్ పదాలను కూడా ఉపయోగించారు. వివాహ ఆహ్వానానికి సంబంధించిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 85 వేల మంది ఈ ఐడియాను లైక్ చేశారు.


నెటిజన్లు కూడా క్రికెట్ పరిభాషలోనే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ``మీ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా``, ``అందమైన భాగస్వామ్యం``, ``ఇద్దరూ కలిసి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలి``, ``మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ మీదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, మార్చి 22న ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 26 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి..

Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!


Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 03:48 PM

Advertising
Advertising