Viral Video: ఛీ..ఛీ.. ఇదెక్కడి చెత్త ఐడియా.. టాయ్‌లెట్ ఎక్కడ ఏర్పాటు చేశారో చూడండి.. వీడియో వైరల్!
ABN, Publish Date - Feb 20 , 2024 | 09:21 PM
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. కొందరు అభిరుచుల గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. కొందరి అభిరుచుల గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అసహ్యం కలగడం ఖాయం. ఎందుకంటే ఓ వ్యక్తి టాయ్‌లెట్ (Toilet) కమోడ్‌ను బాత్రూమ్‌లో కాకుండా తన ఇంటి బాల్కనీ (Balcony)లో బహిరంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను నివ్వెరపరుస్తోంది. నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Toilet seat installed in balcony).
sachkadwahai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి బాల్కనీలో తెల్లటి రంగు టాయిలెట్ సీటు అమర్చి ఉంది. టాయిలెట్ సీటు వరకు చేరుకోవడానికి రెండు మెట్లు కూడా ఉన్నాయి. ఆ ఏర్పాటు మొత్తం పూర్తి బహిరంగంగా ఆరు బయట ఉంది. ఇది నిజంగా నేచర్స్ కాల్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో చూస్తే టాయిలెట్ అలా కట్టించిన వారి తెలివితేటలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``పాపం.. దాని చుట్టూ గోడ కట్టడం మర్చిపోయినట్టు ఉన్నారు``, ``చుట్టు పక్కల ఉన్న వారి పరిస్థితి ఏంటి?``, ``ఇంతకంటే దరిద్రమైన బాత్రూమ్ ప్లాన్ నేను చూడలేను``, ``వెరీ ఫన్నీ.. దీనిని ఎవరూ ఉపయోగించలేరు``, ``ఈ ఆలోచన చేసిన వ్యక్తికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - Feb 20 , 2024 | 09:22 PM