ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: అమృతమేమైనా తాగుతున్నాడా ఏంటి? 61ఏళ్ళ వయసులో కుర్రాడిలా కనిపించడానికి ఇతనేం చేశాడంటే..!

ABN, Publish Date - Apr 18 , 2024 | 03:44 PM

మనుషులెంత చురుగ్గా ఉన్నా, మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కాలంతో పాటూ శరీరంలో మార్పులు మాత్రం వచ్చేస్తుంటాయి. ఎంత కఠినమైన ఆహార నియమాలు, జీవనశైలి పాటించినా మహా అయితే ఓ పదేళ్లు చిన్నగా కనిపించచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ షాకిస్తున్నాడు. ఏకంగా 61ఏళ్ల వయసులో తాత అని పిలిపించుకోవాల్సిన దశలో వైరల్ అవుతున్నాడు.

వయసు కేవలం నెంబర్ మాత్రమే అని అంటారు చాలామంది. మనుషులెంత చురుగ్గా ఉన్నా, మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కాలంతో పాటూ శరీరంలో మార్పులు మాత్రం వచ్చేస్తుంటాయి. ఎంత కఠినమైన ఆహార నియమాలు, జీవనశైలి పాటించినా మహా అయితే ఓ పదేళ్లు చిన్నగా కనిపించచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ షాకిస్తున్నాడు. ఏకంగా 61ఏళ్ల వయసులో తాత అని పిలిపించుకోవాల్సిన దశలో కండలు తిరిగిన దేహంతో, మంచి శరీర సౌష్టవంతో ఔరా అనిపిస్తున్నాడు. మిచిగాన్ కు చెందిన డేవ్ పాస్కో 61ఏళ్ల వయసులో 38ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఇలా కనిపించడం కోసం ఇతను ఏం చేశాడో తెలుసుకుంటే..

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!


ముసలివాళ్లుగా మారడం.. ఆంటీ, అంకుల్.. అవ్వా, తాత అనిపించుకోవడం ఎవరికీ ఇష్టముండదు. కొందరు దుస్తులతోనూ, మేకప్ తోనూ, వయసు పైకి కనిపించే విషయాలను కవర్ చేస్తూ యవ్వనంగా కనిపించడానికి ట్రై చేస్తుంటారు. కానీ యుఎస్ లోని మిచిగాన్ కు చెందిన డేవ్ పాస్కో అనే 61ఏళ్ల వ్యక్తి ఇలాంటి తాత్కాలిక మార్పులతో తృప్తి చెందలేకపోయాడు. తాను వాస్తవంగా చిన్న వయసు వ్యక్తిగా మారడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. మనిషి అనుకుంటే సాధ్యం కానిది లేదంటారు కదా.. అలాగే డేవ్ పాస్కో అనుకున్నది సాధించాడు. 61ఏళ్ళ వయసులో 38ఏళ్ల వ్యక్తిలా తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఇందుకోసం అతను చాలానే కష్టపడ్డాడు. ముఖ్యంగా అతను బయోహ్యాకింగ్ ప్రక్రియను ఫాలో అయ్యాడు.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!


డేవ్ పాస్కో కు ఒక వెబ్సైట్ ఉంది. అందులో అతని దినచర్య మొత్తం పొందుపరచబడి ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఆరుబయట వ్యాయామం చేయడంతో ఇతని దినచర్య మొదలవుతుంది. ఇక ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. రోజూ 158 సప్లిమెంట్లను తీసుకుంటున్నాడు. తన సమయాన్ని తనకోసం ప్లాన్ చేసుకుంటాడు. "నా సమయం చాలా విలువైనది, ఇతరుల కోసం దాన్ని వేస్ట్ చేసుకోను" అని నిక్కచ్చిగా చెబుతాడు ఇతను. ఇలా ఆహారం, వ్యాయామం, సప్లిమెంట్ల సహాయంతో అతను తన వయసునే ఛాలెంజ్ చేసి విజయం సాధించాడు. 90, 110 ఏళ్ళ వయసొచ్చినా తాను ఆరోగ్యంగా జీవించాలనేది తన లక్ష్యమని అంటున్నాడు. బయోహ్యాకింగ్ ద్వారా ఇతను తన వయసును సమర్థవంతంగా తగ్గించుకోవడంతో ప్రస్తుతం ఈ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి ప్రక్రియలు అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని, పైపెచ్చు ఫలితాలు కూడా స్పష్టంగా ఉండవని నిపుణులు అంటున్నారు.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 03:44 PM

Advertising
Advertising