Viral: అమ్మాయిలు మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్కటి మార్చడమే ఆలస్యం..
ABN, Publish Date - Jan 04 , 2024 | 06:25 PM
హైట్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు తమ హైట్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంటారు. హైట్ ఉంటే పర్వాలేదు కానీ.. హైట్ తక్కువ ఉన్న వాళ్లే అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతుంటారు. ఇంటా బయటా.. ఆఖరికి సోషల్ మీడియాలోనూ ఇదే తంతు ఉంటుంది. ఇక అమ్మాయిలకైతే హైట్ ఉన్న అబ్బాయిలంటే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు.
న్యూడిల్లీ: హైట్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు తమ హైట్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంటారు. హైట్ ఉంటే పర్వాలేదు కానీ.. హైట్ తక్కువ ఉన్న వాళ్లే అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతుంటారు. ఇంటా బయటా.. ఆఖరికి సోషల్ మీడియాలోనూ ఇదే తంతు ఉంటుంది. ఇక అమ్మాయిలకైతే హైట్ ఉన్న అబ్బాయిలంటే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓ ప్రయోగం చేశాడు. వచ్చిన ఫలితం చూసి షాక్ అయ్యాడు. బాప్‌రే ఇలా ఉన్నారేంట్రా బాబూ అని సోషల్ మీడియా వేదికగా తాను చేసిన పని.. వచ్చిన ప్రతిస్పందన అన్ని వివరాలను వెల్లడించాడు. మరి ఇంతకీ అతను ఏం చేశాడు.. వచ్చిన రియక్షాన్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం..
ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఇతన డేటింగ్ యాప్ బంబుల్‌లో తన ప్రొఫైల్‌లో ఎత్తును 190 సెంటీమీటర్లు(సుమారు 6 అడుగుల 2 అంగుళాలు)గా మార్చాడు. అతను అలా మార్చాడో లేదు.. బంబుల్‌లో అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వరుసగా వచ్చాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు అమన్.
బంబుల్ అంటే ఏంటి..
బంబుల్ అనేది ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్. యాప్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపు స్వైప్ చేస్తే ఇతరుల ప్రొఫైల్‌లను చూసేందుక వీలుంటుంది. నచ్చిన వినియోగదారులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పెట్టుకోవచ్చు. పరస్పర ఆసక్తి ఏర్పడితే.. ఇద్దరూ ఛాట్ చేసుకోవడానికి, సంభాషించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ యాప్‌ను సాఫ్ట్ వేర్ డెవలపర్ అయిన అమన్ వినియోగిస్తున్నాడు. తన ప్రొఫైల్‌లో హైట్ తప్ప మిగతా వివరాలన్నింటినీ అలాగే ఉంచాడు. ఎత్తును 190 సెంటీమీటర్లుగా మార్చాడు. అంతే.. కేవలం ఒక్క రోజులోనే తొమ్మిది మ్యాచ్‌లు వచ్చాయట. దీనంతటికీ కారణం తన ఎత్తును మార్చుకోవడమే అని అమన్ భావించాడు. ఈ విషయాన్ని ఎక్స్‌లో ప్రస్తావిస్తూ.. 'జోక్‌గా బంబుల్‌లో నా ఎత్తును 190 సెం.మీకి మార్చాను. ఒక రోజులో 9 మ్యాచ్‌లు వచ్చాయి. నా ప్రొఫైల్‌లో వేరే ఏమీ మార్చలేదు. ఇక్కడ నేను గ్రహించేందంటే.. మీరు అగ్లీ కాదు.. పేదవారు కాదు.. ఫన్నీ కాదు.. ఇక్కడ మీరు పొట్టిగా ఉన్నారు. అదే సమస్య' అని పేర్కొన్నాడు అమన్.
కాగా, చిన్న మార్పులు చేయడం ద్వారా డేటింగ్ యాప్‌లో ఎక్కువ మ్యాచ్‌లను పొందింది అమన్ మాత్రమే కాదు. చాలా మంది ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారట. అమన్ పోస్ట్‌కు కొందరు నెటిజన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలను పేర్కొన్నారు. 'ఫౌండర్/CEO- ఫిన్‌క్యాప్ ల్యాబ్ అని నా బయోను మార్చాను. దెబ్బకు బంబుల్ మ్యాచ్‌లతో నిండిపోయింది.' అని ఒక వినియోగదారుడు పేర్కొన్నాడు.
Updated Date - Jan 04 , 2024 | 06:25 PM