ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: మీరు ఫారినర్ల లాగా ఇంగ్లీష్ మాట్లాడాలా..? ఈ కుర్రాడి వీడియోలు చూసేయండి..!

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:52 PM

ఫారినర్ల మాదిరిగా.. ముఖ్యంగా అమెరికన్ల (Americans) లాగా ఇంగ్లీష్ (English) మాట్లాడటం కష్టం. ఎందుకంటే వారి యాష అలా ఉంటుంది. పదాలను పూర్తిగా పలకరు. స్టైలిష్‌గా కూడా ఉంటుంది. సో.. అమెరికన్ల (Americans) మాదిరిగా మాట్లాడటం కష్టమే.. కానీ అదేం లేదంటున్నారు ఒడిశాకు (Odisha) చెందిన ధిరాజ్ తక్రీ (Dhiraj Takri).

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: ఫారినర్ల మాదిరిగా.. ముఖ్యంగా అమెరికన్ల (Americans) లాగా ఇంగ్లీష్ (English) మాట్లాడటం కష్టం. ఎందుకంటే వారి యాష అలా ఉంటుంది. పదాలను పూర్తిగా పలకరు. స్టైలిష్‌గా కూడా ఉంటుంది. సో.. అమెరికన్ల (Americans) మాదిరిగా మాట్లాడటం కష్టమే.. కానీ అదేం లేదంటున్నారు ఒడిశాకు (Odisha) చెందిన ధిరాజ్ తక్రీ (Dhiraj Takri).. తన వీడియోలు చూసి, వారి లాగా మాట్లాడొచ్చని చెబుతున్నారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌, ఎక్స్‌లో వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ధీరజ్ చెప్పిన టిప్స్ చక్కగా ఉన్నాయి. ఎందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోలను చూసేయండి.

ఇంగ్లీష్ నేర్పడం ఓ కల

ఇంగ్లీస్ నేర్పడం ఓ కల అని ఇన్ స్టాగ్రామ్‌ బయోలో ధీరజ్ (Dhiraj) రాసుకున్నారు. మీరు తన వీడియోలను ఇక్కడే ఉండి చూసి, అమెరికన్ల మాదిరిగా మాట్లాడగలరని కోరారు. ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఓ చిన్న టెక్నిక్ చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవల పోస్ట్ చేసిన వీడియో తెగ ట్రోల్ అవుతోంది. మీరు ఫారినర్ల మాదిరిగా ఇంగ్లీష్ (English) మాట్లాడాలంటే ఇలా చేయాలని సూచించారు. గుడ్ మార్నింగ్ అనే సమయంలో గు మార్నింగ్ అనాలని సూచించారు. ఆ వెంటనే అమెరికన్ల వీడియోను ప్లే చేశారు. అచ్చం వారిలాగే ధీరజ్ మాటలు ఉన్నాయి. తర్వాత ఆర్ యు మ్యారిడ్ అనే పదానికి ఆర్ యు మ్యారి అని ధీరజ్ పలికారు. ఆ వెంటనే మరో వీడియో ప్లే చేయగా అలానే ఉంది. సాడ్‌కు డ్ లేకుండా ఉచ్చరించారు. ఇలా కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి.

94 వీడియోలు, 9 లక్షల ఫాలొవర్లు

ఇన్ స్టాగ్రామ్‌లో ధీరజ్ (Dhiraj Takri) ఇప్పటివరకు 94 వీడియోలను పోస్ట్ చేశారు. ఒక్కో వీడియో మిలియన్ వ్యూస్ సాధించింది. ఇన్ స్టలో అతనికి 9 లక్షల ఫాలొవర్లు ఉన్నారంటే మనోడి ఫాలొయింగ్ అర్థం చేసుకోవచ్చు. అమెరిక్ల మాదిరిగా మాట్లాడేందు కోసం మరిన్ని వీడియోలను పోస్ట్ చేశారు. హిమ్, హర్, దేమ్‌లో హెచ్, హెచ్, టీహెచ్ పదాలను సైలంట్ చేశారు. ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. వాటికి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో పాఠాలు బాగున్నాయని, థాంక్స్ బ్రో అని ఒకరు.. యూ ఆర్ బెస్ట్ ఇంగ్లీష్ టీచర్ (English Teacher) అని మరొకరు కామెంట్ చేశారు. మరి ఎందుకు ఆలస్యం ధీరజ్ (Dhiraj Takri) ఇంగ్లీష్ వీడియోలను మీరు కూడా చూసి, అమెరికన్ల మాదిరిగా మాట్లాడేందుకు ట్రై చేయండి.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 12:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising