ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. పప్పు చేయడానికి ఇన్ని తిప్పలా? వీళ్ల టెక్నిక్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే..!

ABN, Publish Date - Jan 23 , 2024 | 02:04 PM

ఇన్ని రోజులు పప్పును ఇలా మెదపవచ్చని చాలా మందికి తెలిసి ఉండదు. ఈ మహిళ చేసిన పనికి షాకవ్వాల్సిందే..

వంట చేయడం ఒక కళ అంటారు. కొందరు అందుబాటులో తగిన పరికరాలు లేకపోయినా సరే తెలివిగా వంట చేస్తారు. ఇలా చేసే వంటలు, వారు చేస్తున్న తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. వంట చేయడానికి ఇన్ని తిప్పలు పడాలా అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: Zombie Virus: ప్రపంచానికి మరో ముప్పు.. ప్రాణాలను బలితీసుకోవడానికి రాబోతున్న జాంబీ వైరస్..?



ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో వంటకం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే పంజాబ్(Punjab) ప్రజలు చలికాలంలో మొక్కజొన్న రొట్టెలను ఇష్టంగా తింటారు. ఆకుకూరల మిశ్రమానికి మొక్కజొన్న పిండిని కలిపి తయారు చేసే సాగ్(Sag) అనే వంటకం మాత్రం అంత సులువుగా చేసేది కాదు. దీనికి చాలా ఓర్పు, సమయం కూడా కావాలి. సాధారణంగా ఆకుకూరల మిశ్రమానికి మొక్కజొన్న పిండిని కలిపి బాగా మిక్స్ అయ్యేలా మిక్సీ పడతారు. కానీ వీడియోలో మహిళకు మిక్సీ లేనట్టు ఉంది. దీంతో వినూత్నంగా ఆలోచించింది. దీనికి ఆమె కుటుంబ సభ్యుల మద్దతు కూడా తోడైనట్టుంది. మహిళ ఆకుకూరల మిశ్రమంలోకి మొక్కజొన్న పిండిని వేసి డ్రిల్లింగ్ మెషీన్ తో మిక్స్ చేయడం వీడియోలో చూడచ్చు. డ్రిల్లింగ్ మెషీన్ మొదలు భాగానికి చెక్కతో గుండ్రని చక్రం లాంటి భాగం అమర్చడం ద్వారా మిశ్రమం బాగా మిక్స్ అవ్వడం సాధ్యమవుతోంది.

ఇది కూడా చదవండి: మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే లెక్క!

ఈ వీడియోను sukhwinder.virdi.984 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 02:04 PM

Advertising
Advertising