ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: బాబోయ్.. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ గెటప్ వేసుకుని ఇతను చేసిన పనేంటో తెలిస్తే..!

ABN, Publish Date - Jan 17 , 2024 | 04:46 PM

డ్రస్సు నుండి లిప్ట్సిక్ వరకు దేన్నీవదలకుండా అలంకరణ చేసుకున్నాడు. కానీ తీరా చేసింది ఈ పని..

ప్రేమ పిచ్చిది అంటారు, గుడ్డిదని కూడా అంటారు. ప్రేమ కారణంగా జీవితాలు తారుమారైన వాళ్లు ఎందరో ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి వెనుకాడరు. ఓ ప్రియుడు అలాగే తన ప్రియరాలికోసం పెద్ద సాహసమే చేశాడు. అచ్చం ప్రియురాలిలా గెటప్ వేసుకుని అతను చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. మరీ ఇంత ప్రేమేంటయ్యా బాబూ అని ముక్కున వేలేసుకుంటున్నారు. పంజాబ్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్(Punjab) లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు ఏకంగా తన ప్రియురాలి గెటప్ వేసుకున్నాడు. సమాచారం ప్రకారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్ కోట్ లో అంగ్రేజ్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను పరమజీత్ కౌర్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె హెల్త్ వర్కర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొట్కాపురాలోని డిఎవి పబ్లిక్ స్కూల్లో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆప్ హెల్త్ సైన్సెన్ వారు హెల్త్ వర్కర్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమెకు బదులుగా ఆమె ప్రియుడు అచ్చం తన ప్రియురాలిలా సల్వార్ సూట్, గాజులు, నుదుట బొట్టు, లిప్టిక్ ఇలా అలంకరణ మొత్తం చేసుకుని పరీక్షకు హాజరయ్యాడు. అతన్ని చూడగానే నిజంగానే అమ్మాయని అనుకున్నారు. పరీక్ష హాలులో అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా అతను నకిలీ ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ను కూడా క్రియేట్ చేశాడు.

ఇది కూడా చదవండి: పిల్లల ఐక్యూ వీర లెవల్ లో ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


సదరు యువకుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా పరీక్ష అధికారులు అతను అమ్మాయి కాదనే విషయాన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రేమ కారణంగా అతనలా చేసినా అది చట్టవిరుద్దమైన పనికావడంతో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ సంఘటన గురించి పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అబ్బాయిలు నిజాయితీగా ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్దపడతారు అని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Viral: వామ్మో ఈ ఒక్క ఫొటోలో ఇన్ని రహస్యాలున్నాయా? ఈ ఫొటోలో మీకు మొదట కనిపించే దృశ్యం మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుందట..!


మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 17 , 2024 | 05:15 PM

Advertising
Advertising