Wedding Cards: అత్యంత ఖరీదైన పెళ్లి పత్రిక.. ఈ ఖర్చుతో మ్యారేజ్ చేసేయొచ్చు
ABN, Publish Date - Nov 01 , 2024 | 01:51 PM
ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా వివాహాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు అందరూ ప్లాన్ చేస్తుంటారు. వివాహ పత్రిక నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.
ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా వివాహాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. తమ స్థోమతను బట్టి ఉన్నదాంట్లో ఎంత బాగా సెలబ్రేట్ చేయొచ్చో అలా ప్లాన్ చేసుకుంటారు. వివాహ పత్రిక నుంచే మ్యారేజ్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. పసుపు రాసి పత్రిక చేతికి ఇచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించడం మన దేశంలో ఆనవాయితీ. ఎంతో ప్రత్యేకత కలిగిన వివాహ పత్రికలను చాలా మంది తమ అభిరుచులకు తగ్గట్లుగా డిజైన్ చేయించి బంధుమిత్రులకు పంచుతుంటారు. వెడ్డింగ్ కార్డ్స్‌లో రకరకాల డిజైన్లు అందుబాటులోకి వస్తుండటంతో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతోంది. పెళ్లి పత్రిక చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవారు ఎక్కువవుతుండటంతో ఇప్పుడు ఇది ఖరీదైన వ్యవహారంగా మారింది. వెడ్డింగ్ కార్డ్స్ వ్యయం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత ఖరీదైన పెళ్లి పత్రిక అందుబాటులోకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి పత్రిక @రూ.11 లక్షలు
వెడ్డింగ్ కార్డ్స్ స్పెషల్‌గా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారి కోసం ఉత్తర్‌ప్రదేశ్, ఫిరోజాబాద్‌లోని ఓ సంస్థ వినూత్న రీతిలో పెళ్లి పత్రికలు తయారు చేస్తోంది. మేలిమి బంగారం, వెండిపూతతో వెడ్డింగ్ కార్డ్స్ అచ్చు వేస్తోంది. అయితే గోల్డ్, సిల్వర్ వెడ్డింగ్ కార్డ్స్ కావాలనుకుంటే జేబుకు భారీగా చిల్లు వేసుకోవాల్సిందే. ఈ ప్రత్యేక పెళ్లి పత్రికల కోసం భారీ ధర చెల్లించాల్సిందే. వీటిని రూపొందిస్తున్న యూపీలోని లక్కీ జిందాల్ అనే వ్యాపారి రూ.10 వేల నుంచి రూ.11 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. కస్టమర్లు తమకు నచ్చిన డిజైన్స్, బడ్జెట్‌ను బట్టి పత్రికలను డిజైన్ చేయించుకోవచ్చని ఆయన అంటున్నారు.
భారీ డిమాండ్
‘ప్రతి పెళ్లి పత్రికను ప్రత్యేకంగా రూపొందిస్తాం. వీటి తయారీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. స్వచ్ఛమైన బంగారం, వెండితో వీటిని డిజైన్ చేస్తాం. మా వెడ్డింగ్ కార్డ్స్‌కు తక్కువ సమయంలోనే భారీ ఆదరణ దక్కింది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. చాలా మంది వధూవరులు తమ అభిరుచి, ఇష్టాఇష్టాలు, స్టైల్‌కు అనుగుణంగా వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేయించుకుంటున్నారు’ అని లక్కీ జిందాల్ తెలిపారు. అయితే దీని గురించి తెలిసిన నెటిజన్స్.. పెళ్లి పత్రిక కోసం ఇన్నేసి లక్షలు ఖర్చు చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యయంతో మొత్తం మ్యారేజ్ చేసేయొచ్చని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 01 , 2024 | 01:51 PM