Viral: ఈ కుర్రాడు నిజమైన జాతిరత్నం..! హార్డ్‌వేర్‌కు, సాఫ్ట్‌వేర్‌కు మధ్య ఉన్న తేడా గురించి ఏ రాశాడంటే..
ABN, Publish Date - Mar 31 , 2024 | 09:30 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఎంతో మంది విద్యార్థులు పగలు, రాత్రి తేడా లేకుండా చదువుతూ పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం చదవకుండా పరీక్షలకు హాజరై తమ తెలివి తేటలు చూపిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల (Exams) కాలం నడుస్తోంది. ఎంతో మంది విద్యార్థులు పగలు, రాత్రి తేడా లేకుండా చదువుతూ పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం చదవకుండా పరీక్షలకు హాజరై తమ తెలివి తేటలు చూపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఓ జవాబు పత్రం చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇచ్చిన ప్రశ్నకు ఏం సమాధానం రాయాలో తెలియక, తమ తెలిసింది ఏదో ఒకటి రాసేస్తున్నారు (Student Funny Answer).
``హార్డ్‌వేర్‌కు, సాఫ్ట్‌వేర్‌కు తేడా ఏంటి?`` అనే ప్రశ్న పరీక్షలో వచ్చింది. దానికి ఆ విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వకుండా ఉండలేరు. ``హార్డ్‌వేర్ ఈజ్ హార్డ్``, ``సాఫ్ట్‌వేర్ ఈజ్ సాఫ్ట్`` అంటూ ఏదేదో రాశాడు. అంతేకాదు సాఫ్ట్‌వేర్ హార్డ్‌గా ఉండదని, హార్డ్‌వేర్ సాఫ్ట్‌గా ఉండదని రాసుకొచ్చాడు. ఈ జవాబు పత్రం దిద్దిన ఉపాధ్యాయుడికి దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ జవాబును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ జవాబుపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ``కచ్చితంగా ఈ కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాల్సినవాడే``, ``ఈ విషయాలు బిల్‌గేట్స్‌కు కూడా తెలియవేమో``, ``పాపం.. ఆ కుర్రాడు ఏమీ చదవలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, ఇటీవలి కాలంలో విద్యార్థులు రాసిన ఫన్నీ జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
Updated Date - Mar 31 , 2024 | 09:30 PM