Well Secret: బావులు గుండ్రంగానే ఎందుకుంటాయి?.. చతురస్రాకారం, త్రిభుజాకారంలో ఎందుకుండవు? కారణమిదే!
ABN, Publish Date - Mar 01 , 2024 | 01:57 PM
Round Shape Well: మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బావులు(Agriculture Well), కొన్ని ఇళ్లలో నీటి కోసం తవ్విన బావులను గమనిస్తే ఒక కామన్ పోలిక కనిపిస్తుంది. దాదాపు చాలా వరకు బావులు గుండ్రాంగానే(Round Well) ఉంటాయి? మరి ఆ బావులు గుండ్రంగానే ఎందుకుంటాయి? చతురస్రాకారంగా గానీ.. త్రిభుజాకారంగా గానీ ఎందుకు ఉండవు అని ఎప్పుడైనా ఆలోచించారా?
Round Shape Well: మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బావులు(Agriculture Well), కొన్ని ఇళ్లలో నీటి కోసం తవ్విన బావులను గమనిస్తే ఒక కామన్ పోలిక కనిపిస్తుంది. దాదాపు చాలా వరకు బావులు గుండ్రాంగానే(Round Well) ఉంటాయి? మరి ఆ బావులు గుండ్రంగానే ఎందుకుంటాయి? చతురస్రాకారంగా గానీ.. త్రిభుజాకారంగా గానీ ఎందుకు ఉండవు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బావులు గుండ్రంగా ఎందుకు ఉంటాయో ఇవాళ మనం తెలుసుకుందాం..
ఇప్పుడంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులకు అనుసంధానంగా నీటి పారుదల కోసం కాలువలు అందుబాటులోకి వచ్చాయి. పూర్వకాలంలో వ్యవసాయం కోసం గానీ.. తాగునీటి కోసం గానీ బావులను తవ్వేవారు. ఈ బావుల ద్వారా తమ తమ నీటి అవసరాలను తీర్చుకునేవారు ప్రజలు అయితే, పూర్వీల నుంచి ప్రస్తుత కాలం వరకు నిర్మించిన దాదాపు బావులన్నీ గుండ్రంగానే ఉంటాయి. ఈ బావులు గుండ్రంగా ఉండటానికి శాస్త్రీయ కారణం ఉందట. బావులు గుండ్రంగా ఉండటానికి ప్రధాన కారణం.. బావుల పునాది చాలా బలంగా ఉంటుంది. గుండ్రని బావిలో మూలలు లేనందున నీటి పీడనం బావి చుట్టూ సమానంగా ఉంటుంది. తద్వారా బావి దెబ్బతినకుండా ఉంటుంది.
బావి ఆకారాన్ని గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంచినట్లయితే నీటి పీడనం నాలుగు మూలల్లో ఉంటుంది. ఇలా నిర్మిస్తే బావి ఎక్కువ కాలం ఉండదు. అంతేకాకుండా.. అది కూడిపోయే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా బావులను వృత్తాకారంలో నిర్మిస్తారు. బావులను గుండ్రంగా నిర్మించడం వలన ఏళ్ల తరబడి అవి చెక్కు చెదరకుండా ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు. మరో కారణం ఏంటంటే.. గుండ్రని బావిని తవ్వడం చాలా ఈజీ. త్రిభుజాకారంలో గానీ.. చతురస్రాకారంలో గానీ బావిని తవ్వడం కాస్త కష్టమైన పని. అందుకే పూర్వకాలం నుంచి అధికంగా గుండ్రంగానే బావులను నిర్మిస్తున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 01 , 2024 | 03:57 PM