Aircrafts: విమానాలకు తెల్ల రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..
ABN, Publish Date - Dec 06 , 2024 | 02:23 PM
గాల్లో రివ్వున దూసుకువెళ్లే విమానాల శబ్దం రాగానే ఎవ్వరైనా ఒక్క క్షణం తల పైకెత్తి చూస్తారు. వాటి రూపు అంతటి ఆకర్షణీయంగా ఉండటంలో రంగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.. మరి విమానాలకు తెల్ల రంగే ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..
ఆకాశంలో ఎగిరే విమానాలను తలచుకోగానే ముందుగా మదిలో మెదిలేది వాటి రంగే. తెల్లటి రంగులో ఆకాశంలో దూరంగా విహరిస్తున్న పక్షిలా కనపడుతుంటాయి. వాణిజ్య విమానాలైతే ముఖ్యంగా తెల్ల రంగులోనే ఉంటాయి. మరి వీటికి తెల్ల రంగే ఎందుకు వేస్తారనేది చాలా మంది పట్టించుకోని విషయం. అయితే, ఇలా చేయడం వెనుక చూపరులను ఆకర్షించాలనే ఉద్దేశం ఒక్కటే కాదు చాలా మందికి తెలియని కొన్ని బిజినెస్ జిమ్మిక్కులు కూడా ఉన్నాయి.
బిజినెస్ కారణాలు..
ఉదాహరణకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ లైన్స్ తమ లోగోను హైలెట్ చేసుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ లో వైట్ కలర్ తో డిజైన్ చేస్తుంది. తెలుపు స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ఇది విమానాల రూపును అందంగా కనపడేలా చేస్తుంది. కానీ దీనిని మెయింటెయిన్ చేయడం అంత తేలిక కాదు. నిత్యం దుమ్ము ధూళితో కూడి ఉండే వాతావరణంలో తిరగడం వల్ల త్వరగా మురికిగా మారుతుంది. అయినప్పటికీ దీనికి ఈ రంగునే ఎంచుకుంటారు. ఇక ఇంధన సామర్థ్యంలోనూ రంగుకు అంతటి ప్రధాన్యం ఏమీ ఉండదు. తెలుపు వంటి తేలికపాటి రంగులు ముదురు పెయింట్లతో పోలిస్తే బరువులో తేలికగా ఉంటాయని కొందరు అంటారు. కానీ అవన్నీ అపోహలే. వంద లీటర్ల వైట్ పెయింట్ వంద లీటర్ల బ్లాక్ పెయింట్ కు సమానంగా ఉంటుందని తెలిపాడు.
నిర్వహణ భారం..
ఎయిర్ క్రాఫ్ట్ జీవిత కాలం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ పరిస్థితులు, పెయింట్ నాణ్యత చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలుపు ముదురు రంగులు రెండింటికీ ఒకే స్థాయి నిర్వహణ అవసరం. కొంత సమయం తర్వాత మళ్లీ వాటిని పెయింట్ చేయాల్సి వస్తుంది. తేలికపాటి రంగులు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ వాటి వల్ల అదనపు ప్రయోజనాలేమీ ఉండవు.
ఆర్మీలో ఉపయోగించేవి భిన్నం..
వాణిజ్య పరంగా ఉపయోగించే విమానాలకు సైన్యంలో ఉపయోగించే విమానాలకు ఎంతో తేడా ఉంటుంది. ఆర్మీలో వాడే వాటికి మరీ ఎక్కువగా బయటకు కనపడని రంగులే వేస్తుంటారు. రహస్య స్థావరాల్లో ఉంచాల్సి వచ్చినప్పుడు, ల్యాండింగ్ వంటి విషయాల్లో ఇది వారికి కలిసొస్తుంది. అందుకే తెలుపు రంగుకు ప్రాధాన్యం ఇవ్వరు.
ప్రమాదాలు అరికట్టగలవు..
తెలుపు రంగు మసకబారే అవకాశం తక్కువగా ఉంటుంది. చీకట్లోనూ కనిపించే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. గంటల తరబడి రన్ వేలపై నిలబడి ఉంటాయి కాబట్టి.. ఇది సోలార్ రేడియేషన్ వల్ల వేడెక్కడం దెబ్బతినడం వంటి ప్రమాదాలకు గురికాకుండా ఉంటుంది. తెలుపు రంగు డెంట్‌లను తొందరగా గుర్తించగలదు. కాబట్టి వెంటనే వాటిని గుర్తించి అవసరమైన మరమ్మతు చేసేందుకు వీలుగా ఈ రంగును ఎంపిక చేసుకుంటారు. ఆకాశంలో పక్షులు కొన్నిసార్లు విమానాలకు అడ్డుగా వచ్చి ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ముదురు రంగులో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తెలుపు రంగు వల్ల ఇవి తేలిగ్గా కనపడటమే కాకుండా ప్రమాదాలను నివారించగలవు.
Viral Video: నిజమైన ‘హార్ట్ బ్రేకింగ్’ అంటే ఇదేనేమో.. మొత్తానికి ఈ వధూవరులు సినిమాను సీన్‌ను మరిపించారుగా..
Updated Date - Dec 06 , 2024 | 02:23 PM