Viral: మొదటి బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత మరో బిడ్డ జననం.. వీళ్లను కవలలు అనొచ్చా?
ABN, Publish Date - Apr 03 , 2024 | 01:55 PM
సాధారణంగా ఒకేసారి జన్మించిన పిల్లలను కవలలు అంటారు. కవలలు చూడడానికి ఒకేలా ఉంటారు. కొందరు భిన్నంగా కూడా ఉండొచ్చు. అయితే వారి జననం మాత్రం ఒకే సమయంలో జరుగుతుంది.
సాధారణంగా ఒకేసారి జన్మించిన పిల్లలను కవలలు (Twins) అంటారు. కవలలు చూడడానికి ఒకేలా ఉంటారు. కొందరు భిన్నంగా కూడా ఉండొచ్చు. అయితే వారి జననం మాత్రం ఒకే సమయంలో జరుగుతుంది. అయితే తాజగా బ్రిటన్ (Britain)లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తాజాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే మొదటి బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డ జన్మించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ (Viral News)గా మారింది.
ఇంగ్లండ్‌కు చెందిన కైలీ డోయల్ అనే మహిళ కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. ఆమెకు కవల పిల్లలు పుట్టబోతున్నట్టు స్కానింగ్ చేసిన డాక్టర్ తెలిపాడు. గర్భధారణ సమయంలో 22 వారాల వరకు ఆమెకు ఎలాంటి సమస్యా ఎదురుకానప్పటికీ ఒకరోజు ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో కైలీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిటిలోనే చనిపోయింది. రెండో బిడ్డ జననం అవుతుందని అందరూ అనుకున్నారు. అలాంటిదేమీ లేకపోవడంతో కైలీని ఇంటికి పంపించేశారు.
మొదటి బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత కైలీకి మళ్లీ నొప్పులు మొదలయ్యాయి. ఈసారి డాక్టర్లు సత్వర చికిత్స అందించడంతో రెండో బిడ్డ ఆరోగ్యంగా జన్మించింది. ఇద్దరు పిల్లల మధ్య అంత గ్యాప్ ఎలా వచ్చిందో తెలియక డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆటోలో వెనుక కూర్చున్న మహిళ.. డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి షర్ట్‌ను జూమ్ చేసి చూస్తే..
Puzzle: మీరు నిజంగా తెలివైన వాళ్లు అయితే.. ఈ ఫొటోలో తప్పేంటో 3 సెకెన్లలో కనిపెట్టండి..!
Updated Date - Apr 03 , 2024 | 01:55 PM