ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Funny Video: ఆంటీ.. చీర బైక్‌ టైర్‌లో పడుతోంది.. అంటే ఆమె చెప్పిన సమాధానం విని నవ్వుకోవాల్సిందే..

ABN, Publish Date - Mar 09 , 2024 | 04:00 PM

ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో (Funny Video) చాలా మందిని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటూ, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో (Funny Video) చాలా మందిని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ బైకుపై (Bike) వెనుక కూర్చుని వెళ్తోంది. ఆమె చీర (Saree) బైక్ టైరుకు తగులుతోంది. వెనుక వస్తున్న యువతులు ఆమె చీరను గమనించారు. చీర సర్దుకోమని సలహా ఇచ్చారు. అయితే ఆమె అసలు విషయం అర్థం చేసుకోకుండా ఇచ్చిన సమాధానం విని అంతా నవ్వుకుంటున్నారు. బైక్ మీద వస్తున్న యువతులు ఆమె వైపు చూసి ``చీర.. చీర..`` అని అరుస్తున్నారు. దానికి ఆమె స్పందిస్తూ.. ``ఈ చీర.. 1500.. 1500`` అంటూ రేటు చెప్పింది. ఆమె సమాధానం విని స్కూటీ మీద వెళ్తున్న యువతులు కూడా నవ్వుకున్నారు.

@swatic12 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 6.7 లక్షల మందికి పైగా వీక్షించారు. 11 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఇది మీమ్ ఆఫ్ ది మంత్``, ``ఆమె భారతీయ మహిళ అనిపించుకుంది``, ``ఆమె ఎంత గొప్పగా చెబుతోందో చూడండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 04:00 PM

Advertising
Advertising