Viral: రెస్టారెంట్ పొరపాటు.. రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్న మహిళ.. పనీర్ శాండ్‌విచ్ ఆర్డర్ చేస్తే..
ABN, Publish Date - May 06 , 2024 | 11:30 AM
ప్రస్తుత బిజీ రోజుల్లో చాలా మందికి ఇళ్లలో వంటలు చేసుకోవడం కుదరలేదు. ఒక మోస్తరు పట్టణాల్లో కూడా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు లోకల్ రెస్టారెంట్లు కూడా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.
ప్రస్తుత బిజీ రోజుల్లో చాలా మందికి ఇళ్లలో వంటలు చేసుకోవడం కుదరలేదు. ఒక మోస్తరు పట్టణాల్లో కూడా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు (Food delivery apps) అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు లోకల్ రెస్టారెంట్లు కూడా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు ఆయా రెస్టారెంట్లు చేసే తప్పుల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో ఆమె రూ.50 లక్షల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది (Viral News).
అహ్మదాబాద్ (Ahmedabad)లోని చాముందగర్‌లో నివాసం ఉండే నిరాలీ పర్మార్ అనే మహిళ ఆన్‌లైన్ ద్వారా పనీర్ టిక్కా శాండ్‌విచ్ (paneer tikka sandwich) ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలీవరి బాయ్ ఇంటికి తీసుకొచ్చి పార్సిల్ అందించాడు. ఆమె ఆ శాండ్‌విచ్‌ను కొద్దిగా తిని షాకైంది. ఎందుకంటే అది పనీర్ శాండ్‌విచ్ కాదు. చికెన్ శాండ్‌విచ్ (chicken tikka sandwich). పూర్తిగా శాకాహార కుటుంబానికి చెందిన ఆమె షాకైంది. వెంటనే అహ్మదాబాద్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. నష్టపరిహారంగా సదరు రెస్టారెంట్ తనకు రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది (Rs 50 lakh compensation).
తను పూర్తి శాకాహారినని, మాంసాహారం తినడాన్ని తమ మతం అనుమతించదని, రెస్టారెంట్ చేసిన తప్పిదంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె వాపోయింది. రెస్టారెంట్‌పై దావా వేసింది. సంబంధిత అధికారులు సదరు రెస్టారెంట్‌కు నోటీసులు పంపించారు. అలాగే రూ.5 వేల జరిమానా కూడా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తేడాగా ఉన్నకారు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!
Viral Video: అదేంటి? ఇలా కూడా బట్టలను ఇస్త్రీ చేస్తారా? వైరల్ వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 06 , 2024 | 11:30 AM