ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ViralVideo: భారత్ పరువు ఎందుకు తీస్తున్నావ్?..లండన్‌లో యువతి చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు!

ABN, Publish Date - Feb 12 , 2024 | 04:21 PM

సంప్రదాయిక వధువు దుస్తుల్లో లండన్‌ వీధుల్లో సంచరించిన ఓ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు వివిధ దేశాల్లో సెటిలవ్వడమే కాకుండా అక్కడి వారికి మన సంస్కృతి సంప్రదాయాలు పరిచయం చేశారు. భారత్ అంటే గౌరవం పెరిగేలా చేశారు. ఇక బ్రిటన్..ముఖ్యంగా లండన్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి స్థానికులకు భారతీయ సంప్రదాయవస్త్రాలు, సంస్కృతి పరిచయమే. కానీ, ఇటీవల ఓ భారతీయ మహిళ వీధుల్లో చేసిన పనికి లండన్‌లో జనాలు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (ViralVideo) మారింది.

Viral: ‘ప్లీజ్.. పిల్లల్ని కనండి! ఒక్కో బిడ్డకు రూ.62 లక్షలు చొప్పున ఇస్తాం..’


శ్రద్ధా అనే యువతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. పెళ్లిలో వధువు ధరించే సంప్రదాయిక దుస్తులు ధరించిన ఆమె లండన్‌ మెట్రోతో పాటూ అక్కడి వీధుల్లో సంచరించింది. జనాలు చూసి ఆశ్చర్యపోతున్నా ఆమె అసలు పట్టించుకోలేదు. యువతి డ్రెస్ చూసి అక్కడి వారు నోరెళ్లబెట్టారు. కొందరేమో ఆమె ఫొటోలు తీసుకున్నారు. ఆమెను చూసిన ప్రతివారూ షాకైపోయారు (Woman walks through London streets wearing bridal lehenga gets trolled).

Viral: అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది? ఈ మహిళలను చూడండి.. ఎవరు చెప్పినా ఆగకుండా..


ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అక్కడ కూడా సంచలనంగా మారింది. చాలా మంది జనాలు పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారు. డ్రెస్‌లో ఆమె క్యూట్‌గా ఉందని కామెంట్ చేశారు. భారతీయతను గొప్పగా ప్రదర్శించావంటూ కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఆమె ప్రయత్నాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి డ్రెస్‌తో వీధుల్లో తిరిగితే పెళ్లిమండపం నుంచి పారిపోయిందనుకుంటారంటూ కామెంట్ చేశారు. జనాలు దృష్టి ఆకర్షించేందుకు ఇలాంటి పనులు చేసిన భారత్ పరువుతీయొద్దంటూ మరికొందరు మండిపడ్డారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. మరి మీరూ ఓ లుక్కేయండి!

Viral: ఈ డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా! యాక్సిడెంట్స్ కాకుండా గొప్ప ప్లానే వేశాడు!

Updated Date - Feb 12 , 2024 | 04:38 PM

Advertising
Advertising